మెగాస్టార్ మంచి మనసు! శివ శంకర్ మాస్టర్ కి చిరంజీవి సహాయం!

ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ కు కరోనా సోకి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజుల నుండి ఆయన హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 75 శాతం ఊపిరితిత్తులకు ఇన్ ఫెక్షన్ సోకినట్లు వైద్యులు చెబుతున్నారు. శివ శంకర్ మాస్టర్ పెద్ద కొడుకుకి కూడా కరోనా సోకి సీరియస్ అయ్యి అపస్మారక స్థితిలో ఉన్నారు. ఇక వీళ్లతో పాటు శివ శంకర్ మాస్టర్ భార్య కూడా కరోనాతో హోమ్ క్వారెంటైన్ లో ఉన్నారు. చిన్నకొడుకు అజయ్ కృష్ణ ఒక్కడే ప్రస్తుతం తండ్రి, అన్న, అమ్మ బాగోగులు చూసుకుంటున్నారు.

అయితే ..,శివ శంకర్ మాస్టర్ కు చికిత్స అందించడం కష్టమవుతోంది. రోజుకు లక్షల రూపాయలు వైద్య ఖర్చుల నిమిత్తం ఖర్చు అవుతోంది. ప్రస్తుతం మాస్టర్ కుటుంబం దగ్గర అంత ఆర్థిక స్థోమత కూడా లేనట్టు తెలుస్తుంది. శివ శంకర్ మాస్టర్ కొడుకు ఇప్పటికే దాతల సహాయాన్ని అర్ధించారు. ఈ నేపథ్యంలోనే మాస్టర్ ని ఆదుకోవడానికి సూనుసూద్, ధనుష్ వంటి స్టార్స్ ముందుకి వచ్చారు. అయితే.. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా.. నేనున్నాను అంటూ అభయ హస్తం అందించే మెగాస్టార్ చిరంజీవి తాజాగా శివ శంకర్ మాస్టర్ కి ఆర్థిక సాయం అందించారు.

Chiranjeevi 3 Lakh Money Donate to Siva Shanker Family - Suman TVశివ శంకర్ మాస్టర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న చిరంజీవి ఆయన కుటుంబ సభ్యులకి దైర్యం చెప్పారు. ఇంతేగాక.. మాస్టర్ వైద్య ఖర్చుల నిమిత్తం రూ.3 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఆయన త్వరగా కోలుకొని, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని మెగాస్టార్ కాంక్షించారు.ఇక శివ శంకర్ మాస్టర్ తో చిరంజీవి అనుబంధం ఈనాటిది కాదు. చిరంజీవి యాక్ట్ చేసిన చాలా సినిమాలకి మాస్టర్ కొరియోగ్రాఫర్ గా పని చేశారు. ఇక.. రామ్ చరణ్ కెరీర్ ని నిలబెట్టిన మగధీర మూవీలో.. ధీర ధీర పాటకి గాను శివ శంకర్ మాస్టర్ జాతీయ అవార్డు అందుకోవడం విశేషం. మరి… ఇలాంటి లెజండ్రీ డ్యాన్స్ మాస్టర్ ని కాపాడుకోవడానికి చిరంజీవి చేసిన ఈ సహాయం నిజంగా అభినందనీయం. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.