విష్ణు విజయం తరువాత మంచు మనోజ్ షాకింగ్ కామెంట్స్!

Manchu Manoj

ఎంతో ఆసక్తిగా జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో మంచు విష్ణు అధ్యక్షుడిగా మెజార్టీతో గెలిపొందాడు. అయితే చిత్ర, విచిత్రాల నడుమ జరిగిన మా ఎన్నికల పోరులో ఎట్టకేలకు ప్రకాశ్ రాజ్ ఓటమిని చవి చూశారు. దీంతో తన ఓటమిపై తాజాగా వివరణ ఇచ్చారు అధ్యక్షుడిగా పోటీ చేసిన ప్రకాష్ రాజ్. ఓటర్ల తీర్పును అంగీకరిస్తున్నానని గెలిచిన అభ్యర్థులకు, మంచు విష్ణుకి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

ఇదిలా ఉంటే.. మా ఎన్నికల వేడి రాజుకున్నప్పటి నుంచి మంచు విష్ణు సోదరుడు మనోజ్ ఏనాడు కూడా ప్రచారంలో కానీ మీడియాలో విష్ణుకి మద్దతుగా ఎక్కడ కనిపించేదని మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఆదివారం జరగిన మా ఎన్నికల్లో కనిపించిన మంచు మనోజ్ విష్ణుకి మద్దతుగా ఉన్నట్లు చెప్పకనే చెప్సాడు. ఈ క్రమంలోనే ఉదయం ఓటు వేసేందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ స్వాగతం పలుకుతూ పవన్ ని కౌగిలించుకున్నారు. ఇక పవన్ ఓటేసేంత వరకు పవన్ పక్కనే ఉంటూ ఓటు వేసిన తర్వాత వెళ్లేటప్పుడు ముందుండి సాగనంపారు మనోజ్.

Manchu Manojఇక మంచు విష్ణు గెలవటంతో రాత్రి తన ఇంటి సమీపంలోకి వచ్చిన అభిమానులతో కాసేపు ముచ్చటించారు మనోజ్. నా జీవితానికి ఇది చాలని అభిమానులంటే నాకు ప్రాణమని అన్నారు. అన్నల్లారా తమ్ముల్లారా.. పందులే గుంపులుగా వస్తాయి.. సింహం సింగిల్ గానే వస్తుందంటూ అన్నారు. అన్నా మీకు ఏం కష్టమొచ్చిన నేను ఉన్నానన్న.. ఐ లవ్ యూ అంటూ ఆనందంతో ఊగిపోయారు మంచు మనోజ్. సింహం సింగిల్ గానే వస్తుందన్న మంచు మనోజ్ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి మాట్లాడొచ్చంటూ మీడియాలో కాస్త చర్చనీయాంశమవుతోంది. ఇక మనోజ్ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి మాట్లాడారనేది దానిపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.