మమతామోహన్ దాస్ అమేజింగ్ బైక్ రైడింగ్!..

‘యమదొంగ’ మూవీతో గుర్తింపు తెచ్చుకున్న పాపులర్ యాక్ట్రెస్ కమ్ సింగర్ మమతా మోహన్ దాస్ మంచి నటిగానే కాకుండా సింగర్‌గానూ ఆకట్టుకుంది. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. రీసెంట్ గా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోని షేర్ చేయగా అందులో మమత బైక్ రైడ్ చేస్తూ బాలీవుడ్ హీరోయిన్ లా బాగా స్టైలిష్ గా కనిపించింది. అంతేకాకుండా ఎవరో రైడ్ కి తీసుకెళ్తారని వెయిట్ చేయడం ఎందుకు? 15 సంవత్సరాల తర్వాత బైక్ డ్రైవ్ చేయడం అమేజింగ్ – కెరీర్ స్టార్టింగ్ లో సినిమా ప్రయత్నాలు చేస్తున్న సమయంలో మోటార్ సైకిల్ నడిపే దాన్ని అంటూ ఆ వీడియోకు పోస్ట్ చేసింది. మమత నటిస్తున్న ‘లాల్ బాగ్’ అనే మలయాళీ సినిమా అదే పేరుతో తెలుగులో విడుదల కానుంది..

download 7

ప్రజీత్ పద్మనాభన్ ను 2011లో పెళ్లాడి 2012లో విడాకులు తీసుకుంది. దాదాపు మూడేళ్ల క్రితం మమతాకి కేన్సర్ వ్యాధి సోకిన విషయం తెలిసిందే. అయితే అప్పుడు క్యూర్ అయ్యింది. ఆమె కూడా చాలా ధైర్యంగా …’నాకేం ఫర్వాలేదు..ట్రీట్ మెంట్ చేయించుకుంటున్నా. త్వరలో కోలుకుంటా’ అంటూ అప్పట్లో ఆమె ఎంతో ఆత్మవిశ్వాసంతో చెప్పేది. ఆమె చెప్పినట్లుగానే చికిత్స చేయించుకోవడం, ఆరోగ్యవంతురాలవ్వడం జరిగింది.

download 5

మలయాళంలో సినిమాలు చేస్తున్న మమతా తెలుగు, తమిళ్ సినిమాల్లో పెద్దగా కనిపించ లేదు. స్టార్ హీరోల సినిమాలలో స్పెషల్ సాంగ్ లను పాడి మంచి విజయాన్ని అందుకుంది. ఇక చింతకాయల రవి, కేడి సినిమాల్లో నటించిన తర్వాత ఇక తెలుగులో ఏ సినిమాల్లో నటించలేదు.ఈ వీడియోని చూసిన నెటిజనులు తెగ లైకులు, కామెంట్లు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here