ఇంటికి బందోబస్తు ‘డోసు’ పెంచిన మహేశ్!..

ఇప్పుడు ఏ సినిమాలు రిలీజులు లేవు. ఫ్యాన్స్ హడావుడి అంతకన్నా లేదు.. ఎవరూ గడపదాటి బయటకు రావడంలేదు. అలాంటప్పుడు మహేష్‌బాబు ఇంటి ముందు భారీ సెక్యూరిటీ ఎందుకు పెట్టుకున్నారు? మరి ఇలాంటి టైమ్ లో టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు ఇంటి ముందు భారీగా సెక్యూరిటీ పెంచడం హాట్ టాపిక్ గా మారింది. కరోనా సెకండ్ వేవ్ ఉప్పెనలా విరుచుకుపడుతోంది. ఎంతటివాళ్లనైనా బలి తీసుకొంటోంది. దానికి సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేదు. గొప్ప, పేద, ప్రముఖులు, సామాన్యుడు అనే తేడా మనకుంది కానీ, కరోనాకు కాదు కదా.  అందుకే ఎలాంటి పక్షపాతం లేకుండా అందరినీ మహమ్మారి కమ్మేస్తోంది.

837681 maheshbabu 061819ఇండస్ట్రీ విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి మొదలు అల్లు అర్జున్, ఎన్టీఆర్ సహా చాలా మంది హీరో హీరోయిన్లు, జూనియర్ ఆర్టిస్టులు కరోనా బారిన పడ్డారు. షూటింగ్‌లు ముందే బంద్ చేస్తున్నారు. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ మహమ్మారి వారిని వదలడంలేదు. అందుకే చాలామంది హీరోహీరోయిన్లు కరోనాకు భయపడి కఠిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మహేశ్ బాబు సైతం గో కరోనా గో అంటూ ఇంట్లో జపం చేస్తున్నాడు. కరోనా దరిచేరకుండా సెక్యురిటీని పెంచాడు. పనివాళ్లకు నిత్యం టెస్టులు చేయిస్తూ వైరస్ కు దూరంగా ఉంటున్నాడు. ఆన్ లైన్ లో మాత్రమే దర్శక నిర్మాతలకు టచ్ లోకి వస్తున్నాడు. ఇప్పటికే మహేష్‌బాబు వ్యాక్సిన్ తొలిడోసు తీసుకున్నారు. త్వరలో సెకండ్ డోస్ తీసుకోనున్నారు. దీంతో సెండ్ డోస్ తీసుకునేవరకూ జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించారు. అందుకే షూటింగ్‌లు బంద్ చేసుకుని ఇంట్లో ఉండడమేకాదు. బయటనుంచి వచ్చేవారి కారణంగా కరోనా మహమ్మారి రాకూడదనే ఉద్దేశంతో ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొత్తానికి కరోనాను దరిచేరనివ్వకుండా చేస్తున్న శతకోటి ప్రయత్నాల్లో ఇదో ప్రయత్నమన్నమాట.