సూపర్ స్టార్ మహేశ్ బాబు పెద్దగా పబ్లిక్ ఈవెంట్స్ లో కనిపించడని తెలిసిందే. అయితే బుధవారం రాత్రి క్విక్ ఆన్ అనే పేమెంట్స్ యాప్ లాంఛ్ కార్యక్రమంలో మహేశ్ పాల్గొన్నాడు. క్విక్ ఆన్ అనే పేమెంట్స్ యాప్ కు మహేశ్ బాబు ఎండార్స్ మెంట్ చేస్తున్నాడు. యాప్ లాంఛ్ సమయంలో మహేశ్ బాబును ఫ్యాన్స్ కొన్ని ప్రశ్నలు అడిగారు. వాటిలో ఒకటి.. మీరు హిందీ సినిమాలో ఎప్పుడు నటించబోతున్నారు? బేసిక్ గా సెటైర్లు వేయడం, కౌంటర్లు ఇవ్వడంలో మహేశ్ బాబు టాప్ ప్లేస్ లో ఉంటాడు. అదే విషయాన్ని మరోసారి ప్రూవ్ చేశాడు.
ఇదీ చదవండి: పిక్స్ వైరల్: హరిహర వీరమల్లు ఫైట్స్ ప్రాక్టీస్ లో బిజీగా పవన్ కల్యాణ్
హిందీ సినిమాలో ఎప్పుడు నటించబోతున్నారు అనే ప్రశ్నకు ‘నేను హిందీ సినిమాల్లో నటించాల్సిన అవసరం ఏముంది? నేను తెలుగులో నటిస్తాను ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదల అవుతుంది. ప్రస్తుతం ఆ ట్రెండేగా నడుస్తోంది’ అంటూ మహేశ్ కౌంటర్ ఇచ్చాడు. ఇలా ఎందుకు స్పందించాడనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. కానీ, మహేశ్ ఫ్యాన్స్ మాత్రం జాన్ అబ్రహంలాంటి వ్యక్తుల కామెంట్లకు మహేశ్ కౌంటర్ ఇచ్చాడని చెబుతున్నారు.ఇటీవల అటాక్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జాన్ అబ్రహం మాట్లాడుతూ నేను తెలుగులాంటి రీజనల్ సినిమాల్లో నటించను అంటూ కామెంట్ చేశాడు. జాన్ అబ్రహం చేసిన ఆ వ్యాఖ్య సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జాన్ అబ్రహం అటాక్ సినిమా కూడా అతని వరుస ఫ్లాపుల ఖాతాలో చేరిపోయింది. హిందీలోనే మొదటి రోజు రూ.3 కోట్లు కూడా రాబట్టలేక బాక్సాఫీసు వద్ద బొక్కబోర్లా పడింది. జాన్ అబ్రహం కామెంట్స్ నేపథ్యంలో మహేశ్ రియాక్షన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మహేశ్ మంచి కౌంటర్ ఇచ్చాడంటూ సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. మహేశ్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.