అవార్డులు, రివార్డులు, ప్రశంసలు అంటే మన టాలెంట్‌కి ఇచ్చే గుర్తింపు. ప్రతి మనిషి గుర్తింపు కోరుకుంటాడు. ఇక సినిమా రంగంలోని వారికి ఇది కాస్త ఎక్కువగానే ఉంటుంది. తమ ప్రతిభను గుర్తించి అవార్డులు లభిస్తే చాలా సంతోషపడతారు. చాలామంది తమకు అవార్డులు రాలేదని బాధపడతారు. అంతేతప్ప.. పిలిచి అవార్డు ఇస్తామంటే వద్దనేవారు ఉండరు. ఒకవేళ అలాంటి వారు ఉంటే.. వారిని పిచ్చి వాళ్ల కింద జమకడతారు. ఇదిగో ఈ జాబితాలో చేరింది నటి కంగనా రనౌత్. ఆమెకు అవార్డు ఇస్తాము అంటే వద్దనడమే కాక ఏకంగా వారిపై కేసు కూడా పెట్టింది. ఈ వార్త తెలిసిన వారు.. ఇదెక్కడి విడ్డూరం అని ఆశ్చర్యపోతున్నారు. ఆ వివరాలు.. బాలీవుడ్ ఫైర్ బ్రాంగ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎవరి బెదిరింపులకు భయపడదు. ముక్కుసూటిగా, కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడుతుంది. ఈ క్రమంలో తాజాగా ఆమె చేసిన పని తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. ఈ ఏడాది ఫిల్మ్ ఫేర్ అవార్డుల కార్యక్రమం కోసం ఇటీవల నామినేషన్స్ ప్రకటించారు. అందులో ‘తలైవీ’ చిత్రానికి ఉత్తమ నటిగా కంగనా నామినేట్ అయ్యింది. ఈ విషయాన్ని ఫిల్మ్ ఫేర్ నిర్వాహకులు ఆమెకు తెలియజేశారు. దాంతో వారిపై కంగనా ఫైర్ అయ్యింది. తాను వద్దంటున్నా ఈ అవార్డులకు ఎందుకు నామినేట్ చేస్తున్నారంటూ వారిపై మండిపడింది. తనకు ఇష్టంలేని అవార్డ్ ఇచ్చి తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాక తన అవార్డు ఇస్తాను అన్న సదరు కంపెనీపై కోర్టుకు వెళ్తున్నట్లు వెల్లడించింది. తాను 2014 నుంచి ఈ అవార్డులను బ్యాన్ చేసినట్లు చెప్పుకొచ్చింది కంగనా. పురస్కారాలు ఇవ్వడంలో వీరు కనీస విలువలు పాటించరని.. నిజాయతీ ఉండదని.. అందుకే తాను ఎనిమిదేళ్లుగా ఈ అవార్డులకు దూరంగా ఉంటున్నాని చెప్పుకొచ్చింది. అయితే కంగనా ఆరోపణలపై ఫిల్మ్‌ఫేర్ స్పందించింది. ‘నిష్పక్షపాతంగా, నిజాయతీగా అవార్డులను అందించడంలో మాకు దశాబ్దాల చరిత్ర ఉంది. మా అవార్డుల కార్యక్రమానికి రాకున్నా.. ఎలాంటి పర్ఫామెన్స్ చేయకున్నా కంగనాకు ఇప్పటికి ఐదుసార్లు పురస్కారాన్ని అందించాం. ఇదే మా సంస్థ నిజాయితీకి నిదర్శనం. ఇప్పుడు ‘తలైవీ’ నామినేషన్ వెనక్కి తీసుకుంటున్నాం. మా సంస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరిస్తే మేమూ కోర్టును ఆశ్రయిస్తాం’ అని ఫిల్మ్ ఫేర్ తాజా ప్రకటనలో పేర్కొంది. మరి ఈ వ్యవహారంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: హీరోయిన్ కంగనకు తీవ్ర అనారోగ్యం.. రూములోంచి కదల్లేని స్థితిలో.. ఇది కూడా చదవండి: స్టార్ కిడ్స్ పై కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్!