కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న చిత్రం విక్రమ్. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్ 3న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరో సూర్య క్యామియో రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. రిలీజ్ కు ముందే ఈ సినిమా క్రేజ్ ఓ రెంజ్ లో ఉంది. విక్రమ్ మూవీ ఓటీటీ + శాటిలైట్ రైట్స్ ను దాదాపు రూ.200 కోట్లకు విక్రయించినట్లు తెలుస్తోంది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ఈ సినిమాకి రూ.110 కోట్ల బడ్జెట్ పెట్టారు. అంటే కేవలం ఓటీటీ, శాటిలైట్ రైట్స్ ద్వారానే ఈ సినిమాకి రూ.90 కోట్లు అదనంగా వచ్చినట్లు చెబుతున్నారు. కాకపోతే ఈ అంశంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఇంక రిలీజ్ దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్స్ జోరుగా చేస్తోంది. ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విక్టరీ వెంకటేశ్, హీరో నితిన్ కూడా హాజరయ్యారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో కమల్ హాసన్ మాట్లాడుతూ ఒకింత ఎమోషనల్ అయ్యాడు. 45 ఏళ్ల క్రితం డాన్స్ అసిస్టెంట్ గా వచ్చినప్పటి నుంచే తెలుగు ప్రేక్షకులు తనను ఆదరించడం ప్రారంభించారని చెప్పుకొచ్చాడు.
Thank you soo much @Suriya_offl sir ✨for this 🔥#VikramFromJune3 pic.twitter.com/brKJBe5n3G
— Lokesh Kanagaraj (@Dir_Lokesh) June 1, 2022
నితిన్, వెంకటేశ్ ను ఉద్దేశించి కమల్ హాసన్ మాట్లాడుతూ.. ‘నితిన్ నువ్వు చాలా లక్కీ.. నీ ఇష్టాలను అర్థంచేసుకునే తండ్రి దొరికాడు నీకు. వెంకటేశ్ కు కూడా రామానాయుడు లాంటి గొప్ప తండ్రి ఉన్నారు. కానీ, వెంకటేశ్ మాత్రం ఎంతో కష్టపడి పైకొచ్చాడు. ఓసారి గోవా ఫిల్మ్ ఫెస్టివల్ లో నన్ను కలిశాడు. నాకు ఆకలిగా ఉంది.. సక్సెస్ వచ్చినా కూడా ఈ ఆకలి తీరడం లేదు.. ఏం చేయాలి అని అడిగాడు. నాకు తోచింది చెప్పాను.’
#VikramFromJune3 #Vikram@ikamalhaasan @Dir_Lokesh @Udhaystalin @anirudhofficial #Mahendran @RKFI @turmericmediaTM @SonyMusicSouth @RedGiantMovies_@spotifyindia @DisneyPlusHS @vijaytelevision @PenMovies @jayantilalgada @actor_nithiin @SreshthMovies @shibuthameens @riyashibu_ pic.twitter.com/OS8qvwCjgn
— VijaySethupathi (@VijaySethuOffl) May 31, 2022
‘నాయుడి గారి అబ్బాయిగా పుట్టినా.. స్ట్రగుల్స్ పడాల్సిన అవసరం లేకపోయినా కూడా వెంకీ మాత్రం ఎంతో కష్టపడి పైకొచ్చాడు. నాయుడి గారి లాంటి తండ్రి నాకుంటే నేను కచ్చితంగా చెడిపోయే వాడిని. చెన్నైకి ఎన్నో గిఫ్ట్స్ వచ్చాయి.. అందులో వెంకటేశ్ కూడా ఒకరు. అక్కడ వెంకటేశ్ ట్రై చేసుంటే కచ్చితంగా గొప్ప హీరో అయ్యేవాడు. నా సినిమా ప్రమోషన్ కి వచ్చినందుకు నేను థ్యాంక్స్ చెప్పను. ఇది నా సినిమా మాత్రమే కాదు.. ఆయన సినిమా కూడా’ అంటూ కమల్ హాసన్ విక్టరీ వెంకటేశ్ పై ప్రశంసలు కురిపించాడు. కమల్ హాసన్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.