మాతృత్వం ప్రతి మహిళ జీవితంలో మర్చిపోలేని అనుభూతి. అమ్మయ్యాకే మహిళ జీవితానికి పరిపూర్ణత లభిస్తుందని భావిస్తారు. వివాహం అయిన వెంటనే అటు పుట్టింటి వారు.. ఇటు మెట్టినింటి వారు కూడా వారసుల కోసం ఎదురు చూస్తారు. అయితే మారుతున్న కాలం, మహిళలకు పెరుగుతున్న ఆర్థిక స్వాతంత్య్రం కారణంగా ఈ కాలం యువతులు వివాహం, పెళ్లి వంటి బంధాలకు గ్యాప్ ఇస్తున్నారు. వివాహం చేసుకోవడమే ఆలస్యంగా చేసుకుంటున్నారు. ఆ తర్వాత పిల్లలను కూడా వెంటనే కనడం లేదు. ఇక మరికొందరు అందం మీద శ్రద్ధతో పిల్లలను కనాలంటే వెనకడుగు వేస్తున్నారు. పిల్లలు పుట్టాక శరీరంలో మార్పులు వస్తాయని.. అందం చెడిపోతుందని.. శరీరం బిగువు సడలిపోతుందనే ఉద్దేశంతో చాలా మంది పిల్లలన్ని కనడానికి ఇష్టపడటం లేదు. కొందరు మాత్రం సరోగసి వంటి విధానాలను పాటిస్తున్నారు. ఇక సామాన్యుల పరిస్థితి ఇలా ఉంటే.. ఇండస్ట్రీలో కొనసాగే వారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందమే వారికి పెట్టుబడి. ఇక అదే చెడిపోతుంది అంటే.. అవకాశాలు కూడా రావు. అందుకే ఇండస్ట్రీకి చెందిన చాలా మంది తారలు ఏళ్ల తరబడి వివాహాల్ని వాయిదా వేస్తుంటారు. ఇక పరిశ్రమకు గుడ్‌బై చెప్పాలనుకున్నప్పుడే పిల్లల గురించి ఆలోచిస్తారు. ఆ తర్వాత వారికి అవకాశాలు రావడం కూడా కష్టంగా ఉండేది. ఇది కూడా చదవండి: Kajal Aggarwal: కాజల్ కమ్ బ్యాక్! తల్లి అయ్యాక ఫస్ట్ ఫోటోతోనే రచ్చ! అయితే ప్రస్తుత కాలంలో పరిస్థితులు మారుతున్నాయి. నేటి హీరోయిన్లు ఇటు కెరీర్‌కు.. అటు వ్యక్తిగత జీవితానికి సమ ప్రాధాన్యత ఇస్తూ.. బ్యాలెన్స్‌గా జీవితాన్ని గడుపుతున్నారు. చేతి నిండా ప్రాజెక్ట్‌లు ఉన్నా సరే.. పెళ్లి చేసుకుని పిల్లల్ని కనడానికి సిద్ధపడుతున్నారు. వాటి తర్వాతే ఏదైనా అని తేల్చి చెప్తున్నారు. తాజాగా పెళ్లి పీటలు ఎక్కి, బిడ్డలకు జన్మనిచ్చిన హీరోయిన్లను చూస్తే ఈ విషయం అర్థం అవుతోంది. ఇది కూడా చదవండి: ఆచార్యలో కాజల్ లేకపోయినా.. అంత రెమ్యూనరేషన్ తీసుకుందా? టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ కూడా ఈ కోవలోకి వస్తుంది. టాప్ హీరోయిన్గా వెలుగొందుతున్న వేళనే పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. ఆ వెంటనే గర్భం దాల్చడం, బిడ్డకు జన్మనివ్వడం చేసింది. ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తోంది. ప్రతి నిమిషం బిడ్డతో గడుపుతోంది. ఆ మధురానుభూతులను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటుంది. ఈ క్రమంలో తాజాగా కొడుకు పక్కనే పడుకుని ఉన్న ఫోటోని షేర్ చేసింది కాజల్. ఇది చూసిన అభిమానులు క్యూట్ బేబీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక కాజల్ స్టార్డమ్, ఆమె క్రేజ్ పరిశీలిస్తే.. మరో ఐదేళ్లు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా కొనసాగేది. కోట్లలో రెమ్యూనరేషన్ అందుకునేది. కానీ ఆమె అవేవి ఇవ్వలేని ఆనందాన్ని కోరుకుంది. అందుకే సంతోషంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చి వ్యక్తిగత జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) ఇది కూడా చదవండి: తల్లయ్యాక కాజల్ పెట్టిన ఫస్ట్ పోస్ట్.. ‘నిద్రలేని రాత్రులు, రక్తస్రావం కానీ అద్భుతం’! ఇక కాజల్ పోస్టులు చూసిన జనాలు.. సామాన్య మహిళలే బిడ్డకు జన్మనివ్వాలంటే ఆలోచిస్తున్నారు. అందం, కెరీర్ గురించి ఆలోచిస్తూ.. పెళ్లి, బిడ్డల విషయంలో వెనకడుగు వేస్తున్నారు. కానీ స్టార్ హీరోయిన్ అయిన మీరు వాటి గురించి పట్టించుకోకుండా.. ఇంత సింపుల్‌గా గడుపుతున్నారు. నిజంగా మీకు హ్యాట్సాఫ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial)