యన్టీఆర్ ఇంట్లో శుభకార్యం! లీకైన ఫోటోలు! ఏమి జరిగిందో తెలుసా?

జూనియర్ యన్టీఆర్.. మాస్ లో మంచి క్రేజ్ ఉన్న హీరో. ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసి నటించగల సామర్ధ్యం తారక్ సొంతం. ఇక ఫైట్స్, డ్యాన్స్ లలో ఈ నందమూరి హీరోని మ్యాచ్ చేయడం చాలా కష్టం. ఇన్ని స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి కాబట్టే తారక్ అంటే అభిమానులకు అంత ఇష్టం. ఇక జూనియర్ యన్టీఆర్ కి సంబంధించిన మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తుంటారు. అలాంటి తారక్ రియల్ లైఫ్ లో ఏ చిన్న సంతోషాన్ని అయినా ఫాన్స్ సెలబ్రేట్ చేసుకోకుండా ఎలా ఉంటారు. అమ్మ, నాన్న, తారక్ అంటూ అభిమానులు ఆయన్ని ఎప్పుడో తమ ఇంటి మనిషిని చేసేసుకున్నారు. కానీ.., తాజాగా జూనియర్ ఇంట్లో ఓ శుభకార్యం జరిగింది. ఈ విషయం కాస్త ఆలశ్యంగా బయటకి రావడం విశేషం. ఆ వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం జూనియర్ యన్టీఆర్ ఓ పూజారితో కలసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో.., అసలు తారక్ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగిందా అని ఆరా తీస్తే బుల్లి రామయ్యకి సంబంధించిన న్యూస్ బయటకి వచ్చింది.

ntr 2 1యన్టీఆర్ చిన్న కుమారుడు భార్గవ్ రామ్కు తాజాగా అక్షరాభ్యాసం నిర్వహించారట. దీనిని కుటుంబ సభ్యుల మధ్య జరుపుకున్నట్లు తెలుస్తోంది. కరోనా నిబంధనలు అమలులో ఉండటంతో బయట నుండి ఎవ్వరికీ ఆహ్వానం అందలేదట. కానీ.., యన్టీఆర్ ఈ మధ్యే కరోనా నుండి బయటపడ్డారు. మరి.. ఇలాంటి సమయంలో కూడా సడెన్ గా ఈ కార్యక్రమం నిర్వహించడానికి ప్రత్యేక కారణం ఉందట. భార్గవ్ రామ్ 2018 జూన్ 14న జన్మించాడు. అంటే అతడికి ఇప్పుడు మూడో సంవత్సరం నడుస్తోంది. మరో 15 రోజులైతే నాలుగో ఏడాదిలోకి అడుగు పెట్టేస్తాడు. నిజానికి మూడేళ్లు లోపలే అక్షరాభ్యాసం పూర్తి చేస్తారు. ఇందుకే ఇంత తొందరగా బుల్లి రామయ్య చేత అక్షరాలు దిద్దించేశారట. ఇక జూనియర్ యన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ట్రిపుల్ ఆర్ మూవీలో నటిస్తున్నాడు. దీని తరువాత కొరటాల శివతో మరో మూవీకి కమిట్ అయ్యాడు జూనియర్. ఆ తరువాత ప్రశాంత్ నీల్ కూడా క్యూ లో ఉన్నారు. ఇలా రీల్ లైఫ్ ని సూపర్భ్ గా ప్లాన్ చేసుకున్న యన్టీఆర్.., రియల్ లైఫ్ లోను ఎప్పుడు జరగాల్సిన కార్యాలను అప్పుడు పద్దతిగా పూర్తి చేస్తున్నాడు అనమాట. మరి.. నాన్న చేత అక్షరాభ్యాసం పూర్తి చేసుకున్న చిన్న రామయ్య భార్గవ్ రామ్ కి కామెంట్స్ రూపంలో మీ దీవెనలు అందించండి.