పుష్ప పాటలో బూతు! జియోసావన్ పై బన్నీ ఫ్యాన్స్ ఫైర్!

Pushpa Jio Savan

“పుష్ప”.. సినీ అభిమానులు దేశ వ్యాప్తంగా ఈ పాన్ ఇండియా మూవీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పుష్ప తెరకెక్కుతోంది. ఇక పుష్ప విడుదలకి సమయం దగ్గర పడటంతో మేకర్స్ ప్రమోషన్స్ విషయంలో జోరు పెంచారు. ఇందులో భాగంగానే వరుస ప్రమోషనల్ వీడియోస్ రిలీజ్ చేస్తూ.. తగ్గేదేలే అనిపిస్తున్నారు మేకర్స్.

ఇందులో భాగంగా విడుదలైన “ఏ బిడ్డా.. ఇది నా అడ్డా” అనే పాట రికార్డు వ్యూస్ సొంతం చేసుకుంటూ రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. మాస్ పల్స్ అధికంగా ఉన్న ఈ సాంగ్ బన్నీ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించింది అంటే అతిశయోక్తి కాదు. కానీ.., ఇప్పుడు ఓ మ్యూజిక్ యాప్ “ఏ బిడ్డా.. ఇది నా అడ్డా” అనే పాట అర్ధాన్నే మార్చేసి, “ఏ బిడ్డా.. ఇది నా *డ్డ అంటూ బూతుని ఆపాదించేసింది.

ఒకప్పుడు సినిమా పాటలకి మార్కెట్ అంటే కేవలం ఆడియో క్యాసెట్స్ రూపంలోనే ఉండేది. కానీ.., ఇప్పుడు లెక్క మారింది. ఏదైనా పెద్ద సినిమా పాటలు విడుదలైతే మ్యూజిక్ యాప్స్ వాటి రైట్స్ దక్కించుకుంటున్నాయి.

ప్రముఖ మ్యూజిక్ యాప్ జియోసావన్ కూడా పుష్ప రైట్స్ ఇలాగే దక్కించుకుంది. కానీ.., తెలుగులో పుష్ప మూవీ సాంగ్స్ ప్లే లిస్ట్ ని డిస్ ప్లే చేసే సమయంలో జరిగిన తప్పుని ఆ సంస్థ గుర్తించలేకపోయింది. “ఏ బిడ్డా.. ఇది నా అడ్డా” అని ఉండాల్సిన దగ్గర.. “ఏ బిడ్డా.. ఇది నా *డ్డ అంటూ బూతు వచ్చేసింది. దీంతో.. ఈ స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

తమ అభిమాన హీరో పాటని ఇలా బూతు పాటగా అప్లోడ్ చేసినందుకు బన్నీ ఫ్యాన్స్ జియోసావన్ పై ఫైర్ అవుతున్నారు. దీంతో.. కాస్త ఆలస్యంగా తప్పు తెలుసుకున్న జియోసావన్ సంస్థ యాప్ టోటల్ గా తెలుగు ఆప్షన్ లేకుండా చేసేసింది. కానీ.., అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. రీజనల్ లాంగ్వేజస్ విషయంలో సరైన శ్రద్ద పెట్టకుండా, భాషని కూడా గూగుల్ నుండి ట్రాన్స్లేట్ చేసుకుని, వాటిపై ఆధారపడటం వల్లే ఏ సమస్య తలెత్తినట్టు తెలుస్తోంది. మరి ఏ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.