జబర్దస్త్.. ఎంతో కళాకారులకు గుర్తింపు, అవకాశం కల్పించిన ప్రోగ్రామ్. జబర్దస్త్ వల్ల తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంతో గొప్పగొప్ప కమీడియన్లు దొరికారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలా బుల్లితెరపై గుర్తింపు, అభిమానులను పొందిన వారిలో కొమరం అలియాస్ కొమరక్క కూడా ఒకరు. తన మాటలు, యాస, కట్టుబొట్టుతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. అయితే ఇది అంత తేలికగా వచ్చిన గుర్తింపు కాదు. అందుకోసం ఎంత కష్టపడ్డాడో తనకు భార్య ఎంత సహాయంగా నిలిచిందో కొమరం చెప్పుకొచ్చాడు.
యాంకర్ సుమ క్యాష్ ప్రోగ్రామ్ లో పాల్గొన్న కొమరం తన భార్య రజిత గురించి ఇప్పటివరకు ఎక్కడా చెప్పని విషయాలు పంచుకున్నాడు. అతనికి ఇష్టమైన ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి తన భార్య ఎంత సపోర్ట్ చేసింది, ఏమేం త్యాగాలు చేసింది వివరించాడు. అసలు అతని జీవితంలో రజిత లేకపోతే ఏమైపోయేవాడినో అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.
‘మూడేళ్లు ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నాలు చెయ్యి.. నా గురించి, పిల్లల గురించి మర్చిపో.. నువ్వు సక్సెస్ కాలేకపోతే తిరిగి వచ్చెయ్యి అని చెప్పింది. ఐదేళ్లు రాత్రింబవళ్లు టైలరింగ్ చేసి నాకు నెలకు రూ.3 వేలు అకౌంట్ లో వేసేది’ అంటూ కొమరం చెప్తూ స్టేజ్ మీదే ఏడ్చేశాడు. కొమరం కోసం అతని భార్య చేసిన త్యాగాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.