దారుణంగా పావలా శ్యామలా పరిస్థితి! కన్నీరు ఆగవు!

shyamalaసినీ లోకం ఎప్పుడూ గమ్మత్తుగానే ఉంటుంది. ఇక్కడ ఎవరి జీవితాలు ఎప్పుడు, ఎలా మారిపోతాయో ఎవరికీ అర్ధం కాదు. తెరపైన కనిపించే నటులు తెర వెనుక ఎలా ఉంటారో ఎవ్వరికీ తెలియదు. వారి జీవితాల్లో కూడా కన్నీరు పెట్టించే కష్టాలు ఉంటాయి. ఒకప్పుడు చేతి నిండా అవకాశాలతో బిజీగా గడిపిన నటులు.., జీవితపు చివరిరోజుల్లో మాత్రం దయనీయమైన పరిస్థితిల నడుమ ఉండటం చూస్తూనే ఉన్నాము. అచ్చం ఇలాంటి కథే..

నటి పావలా శ్యామలాది. సీనియర్ ఆర్టిస్ట్ గా ఈమె 250 చిత్రాలకి పైగా నటించింది. అగ్ర హీరోలు అందరితో కలసి సినిమాలు చేసింది. కానీ.., ఇంతలా కష్టపడ్డా.., ఆమె జీవితంలో ఆర్ధికంగా స్థిరపడలేకపోయింది. ఇప్పుడు కూడా ఆమెది ఇదే పరిస్థితి. ఒకవైపు కుమార్తె అనారోగ్యం.. మరోవైపు ఆర్థిక సమస్యలు ఆమెను తెగ ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.తెర మీద నటనతో ఎన్నో అవార్డులు.. పురస్కారాలు అందుకున్న ఆమె.. జానెడు పొట్టను పోషించుకోవటానికి తనకు వచ్చిన అవార్డ్స్ ని సైతం అమ్మేసుకున్నారు. చివరకు ఇంటి అద్దె కూడా కట్టలేని దీనమైన స్థితిలో ఆమె ఉన్నారు. గతంలో ఆమెకు తెలంగాణ ప్రభుత్వం నెలకు రూ.10వేలు చొప్పున పెన్షన్ వచ్చేలా సాయం చేశారు. అయితే.. తాజాగా ఆ పెన్షన్ కూడా సరిగ్గా రావడం లేదు. దీంతో.. ఆమె మరింత ఇబ్బందుల్లో ఉన్నారు.

గడిచిన మూడు నెలలుగా ఇంటి అద్దెను కట్టలేని దీన స్థితిలో ఉన్న ఆమెను పెద్ద మనసున్న వారు ఆదుకోవాలని కోరుతున్నారు. నిజానికి పావలా శ్యామలా కూతరు అనారోగ్యమే ఆమెని మానసికంగా కృంగతీసింది. ఆ సమయంలోనే శ్యామలకి సినిమా అవకాశాలు తగ్గాయి. ఇలా.., జీవితంలో ఇబ్బంది పడుతోంది అని తెలిసి అప్పట్లోనే ఆమెకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లక్ష రూపాయలు సహాయం చేశారు. ఆ తరువాత కొంత కాలానికి ఆమెకు పెన్షన్ వచ్చే ఏర్పాట్లు చేశారు. ఇలా ఆమె కష్టాలు తీరుతాయి అనుకున్న సమయంలో మరోసారి ఆమె ఇబ్బంది పడుతున్న విషయం బయటకి వచ్చింది. తాజాగా పావలా శ్యామల తిండికి కూడా ఇబ్బంది పడుతున్నారని తెలిసి.., మరో నటి కరాటే కళ్యాణి ఆమెకి సరుకువులు అందివ్వడానికి స్వయంగా ఇంటికి వెళ్లారు. అక్కడ.., వణికిపోతున్న దేహం, చినిగిపోయిన బట్టలు, సన్నగా అయిపోయిన పావలా శ్యామలాని చూసి ఆమె కన్నీరు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో.., పావలా శ్యామలాని సినీ పెద్దలు ఆదుకోవాలన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.