చిరంజీవి ‘గాడ్‌ఫాదర్’ మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్ డేట్!

Ramya Krishna Chiranjeevi God Father

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మలయాళ సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’కి తెలుగులో రీమేక్ గా వస్తున్న చిత్రం ‘గాడ్‌ఫాదర్’. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు తమిళ డైరెక్టర్ మోహన్‌రాజా. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ కూడా నటించనున్నట్లు గత కొంత కాలం నుంచి న్యూస్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకుంటోందట. తాజాగా ఈ సినిమాలోని ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది.

ఒరిజినల్ వెర్షన్ లో మంజువారియర్ చేసిన పాత్రలో తెలుగు నటి రమ్యకృష్ణ నటించనుందని వార్తలు తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఈ పాత్ర కోసం అనేక మంది తారల పేర్లు వినిపించినా చివరికి రమ్యకృష్ణ పేరును మూవీ యూనిట్ ఫైనల్ చేశారని తెలుస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ‘గాడ్‌ఫాదర్’ మూవీలో చిరంజీవికి చెల్లెలుగా రమ్యకృష్ణ నటించనుందని తెలుస్తోంది. మరి ఈ వార్తలో నిజమెంత అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే. గతంలో చిరు సరసన రమ్యకృష్ణ అనేక సినిమాల్లో నటించింది.