మోస్ట్ డిజైరబుల్ మేన్ గా రౌడీ హీరో! చరణ్ ని వెనక్కి నెట్టిన తారక్!

హీరోయిన్స్ పేర్లు చెప్పగానే ముందుగా గుర్తుకి వచ్చేది అందం మాత్రమే. వారి నటన, డ్యాన్స్ లు ఇవన్నీ తరువాతి సంగతులే. కానీ…, హీరోల విషయంలో లెక్క మారుతుంది. హీరో అంటే డైలాగ్స్ ఇరగతీయాలి. ఫైట్స్ చేస్తే దుమ్ము లేచిపోవాలి. స్టెప్పులు వేస్తే ఫ్యాన్స్ విజిల్స్ వేయాలి. మన తెలుగునాట హీరో అంటే ఉండాల్సిన మినిమమ్ క్వాలిఫికేషన్స్ ఇవి. కానీ.., ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితి మారుతోంది. ఇప్పుడు స్క్రీన్ పై హీరోయిన్ తో సమానంగా హీరో కూడా అందంగా కనిపించాల్సిందే. దీంతో.., మారిన ట్రెండ్ ని అందిపుచ్చుకోవడానికి హీరోలంతా నానా కష్టాలు పడుతున్నారు. అమ్మాయిల చేత డిజైరబుల్ మేన్స్ అనిపించుకోవడానికి గంటలకి గంటలు జిమ్ లో కుస్తీలు పడుతున్నారు. సరికొత్త ఫ్యాషన్ ని ఫాలో అవుతూ వావ్ అనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టైమ్స్ ఆఫ్ ఇండియా మోస్ట్ డిజైరబుల్ మేన్ 2020 జాబితాను విడుదల చేసింది. స్టార్ట్గా, సెక్సీగా, చలాకీగా ఉంటూ తమ రంగంలో అత్యంత ప్రతిభను చూపే వారిని ఈ జాబితాలో ఎంపిక చేస్తారు. ఇప్పుడు ఈ లిస్ట్ లో మన తెలుగు హీరోల హవా కొనసాగింది. ఈ లిస్ట్ లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ వరుసగా మూడోసారి టాప్ ప్లేస్ను దక్కించుకున్నారు. 2018, 2019 సంవత్సరాలకి గాను విజయ్ మోస్ట్ డిజైరబుల్ మేన్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి కూడా సేమ్ ఫీట్ ని రిపీట్ చేసి.., హ్యాట్రిక్ సాధించాడు మన అర్జున్ రెడ్డి.

most 2 టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఏ స్టార్ హీరో కూడా ఈ రికార్డ్ ని సాధించలేకపోవడం విశేషం. ఇక విజయ్ దేవరకొండ తరువాత ఈ లిస్ట్ లో రామ్ పోతినేని రెండో స్థానాన్ని దక్కించుకున్నారు. హైదరాబాద్ టైమ్స్ విభాగం ప్రకటించిన ఈ మోస్ట్ డిజైరబుల్ మేన్ లిస్ట్ లో ఈతరం అగ్ర హీరోలు కూడా సత్తా చాటారు. నందమూరి తారక రాముడు ఈ లిస్ట్ లో మూడో స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. నిజానికి 2019లో 19వ స్థానంలో ఉన్న జూనియర్ యన్టీఆర్.. ఇలా ఏకంగా 16 స్థానాలు ఎగబాకి మూడవ స్థానంలో నిలవడం గొప్ప అనే చెప్పుకోవాలి. ఈ క్రమంలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ని సైతం వెనక్కి నెట్టాడు జూనియర్. పోయిన ఏడాది 2వ స్థానంలో నిలిచిన రామ్ చరణ్ ఈసారి 4వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక ఐకాన్ స్టార్ గా చెప్పుకునే బన్నీ మాత్రం మోస్ట్ డిజైరబుల్ మేన్ లిస్ట్ లో 16వ స్థానానికి పడిపోవడం అందరికీ షాక్ ఇస్తోంది. ఇక వీరితో పాటు.., నాగశౌర్య, నాగచైతన్య, సందీప్ కిషన్, నవదీప్, రానా దగ్గుబాటి, అఖిల్ సార్థక్, సుధీర్ బాబు, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, కార్తీకేయ, అఖిల్ అక్కినేని, ఆనంద్ దేవరకొండ, విశ్వక్ సేన్, నితిన్, నాని వంటి హీరోలు అంతా ఈ లిస్ట్ లో స్థానం దక్కించుకోవడం విశేషం. మరి మీ దృష్టిలో మోస్ట్ డిజైరబుల్ స్టార్ గా మన హీరోలలో ఎవరికి స్థానం దక్కుతుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.