దర్శక ధీరుడు రాజమౌళి.. పాన్ ఇండియా సినిమాలకు ఆధ్యుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్– రామ్ చరణ్ ల కాంబోలో ట్రిపులార్ ఎంతటి భారీ విజయం సాధించిందో చూశాం. రూ.550 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తే.. బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.1200 కోట్లు కలెక్ట్ చేసింది. ఒక్క ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ట్రిపులార్ సినిమా రికార్డు కలెక్షన్స్ సాధించింది. పాన్ ఇండియా సినిమాగానే కాకుండా.. ఒక మంచి మల్టీస్టారర్ గా సినీ ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న విషయం తెలిసిందే. జీ5, నెట్ ఫ్లిక్స్ ఓటీటీల్లో ఈ సినిమా స్ట్రీమ్ అవుతోంది.
విమర్శకులు సైతం ప్రశంసించిన చిత్రం ట్రిపులార్ అని అందరికీ తెలిసిందే. సాధారణ ప్రేక్షకుల మొదలు, సినీ ప్రముఖులు సైతం ఈ సినిమా చూసి సోషల్ మీడియాల్లో తమ ఆనందాన్ని వ్యక్త పరచడం చూశాం. తాజాగా హాలీవుడ్ కు చెందిన స్టాండప్ కమీడియన్, యాక్టర్, స్క్రిప్ట్ రైటర్ అయిన పాటన్ ఓస్వాల్ట్ ట్రిపులార్ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించాడు. నెట్ ఫ్లిక్స్ లో ఈ చిత్రం చూసిన తర్వాత ట్రిపులార్, రాజమౌళిపై సిరీస్ ఆఫ్ ట్వీట్స్ చేశాడు.
If this ISN’T playing near you in IMAX then this is the next best way to watch it. Fucken @RRRMovie is insane. https://t.co/1kwNFwtTMR
— Patton Oswalt (@pattonoswalt) May 24, 2022
‘ట్రిపులార్ సినిమా మీ దగ్గర్లోని థియేటర్లలో ఆడకపోతే.. మీకున్న మరో అద్భుతమై మార్గం.. నెట్ ఫ్లిక్స్ లో చూడండి’ అంటూ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ కు ట్రిపులార్ సినిమా అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ అడ్మిన్ థాంక్యూ అని రిప్లై ఇయ్యాడు. ఆ ట్వీట్ కు పాటన్ ఓస్వాల్ట్ మళ్లీ స్పందించాడు.
‘మీకు బుర్రలు పనిచేస్తున్నాయా? మిమ్మల్ని సినిమాలు తీయనివ్వకూడదు(రాజమౌళి ఇలాంటి అద్భుతమైన సినిమాలు తీస్తే.. మిగిలిన వాళ్ల పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నట్లుగా). మీ నుంచి రాబోయే తర్వాతి సినిమా చూసేందుకు నేను ఎంతో ఆతురతగా ఉన్నాను’ అంటూ హాలీవుడ్ నటుడు పాటన్ ఓస్వాల్ట్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఓస్వాల్ట్ చేసిన ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పాటన్ ఓస్వాల్ట్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
You guys are out of your fucking minds, you should not be allowed to make films, and I can’t wait to see what you do next. https://t.co/SVFDD064Iq
— Patton Oswalt (@pattonoswalt) May 24, 2022