‘సామీ సామీ’ కవర్ సాంగ్ కోసం రెండు గాజులు అమ్ముకున్న హీరోయిన్

Saami Saami Pushpa

సినీ ఇండస్ట్రీ అంటే పైకి కనిపించే అంత ప్రశాంతంగా ఉండదు. ఇక్కడ అవకాశాలు సాధించాలంటే ఎన్నో అవరోధాలను, అగాధలను దాటాల్సి ఉంటుంది. ఒక్కోసారి ఆస్తులను అమ్ముకోవాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని మరోసారి నిజం చేసి చూపించింది హీరోయిన్ రేఖా భోజ్. రేఖా తెలుగులో కొన్ని చిన్న సినిమాల్లో నటించింది. నటిగా ఈమెకి మంచి గుర్తింపు దక్కినా, పెద్ద సినిమాల్లో మాత్రం అవకాశాలు రావడం లేదు. ఈ నేపథ్యంలో తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాని వాడేసుకుంది.

ఈ మూవీలోని సామి సామి సాంగ్ కి కవర్ అద్భుతమైన కవర్ సాంగ్ చేసింది రేఖా భోజ్. తాజాగా విడుదలైన ఈ పాట ఒరిజినల్ కి ఏ మాత్రం తగ్గకుండా ఉండటం విశేషం. మరి.. కవర్ సాంగ్ ఈ రేంజ్ లో రావడానికి ఈ అమ్మడికి డబ్బు ఎక్కడిది అనుకుంటున్నారా? తన దగ్గర ఎప్పటి నుండో ఉన్న రెండు గాజులను అమ్మేసి రేఖా భోజ్ ఈ కవర్ సాంగ్ చేసిందట. దీంతో.. సినిమాపై ఈమెకి ఉన్న కమిట్మెంట్ కి సెల్యూట్ అంటూ అంతా రేఖా భోజ్ ని అభినందిస్తున్నారు. ప్రస్తుతం రేఖా భోజ్ చేసిన సామి సామి కవర్ సాంగ్ సోషల్ మీడియాని ఒక ఊపు ఊపేస్తోంది. మరి.. మీరు కూడా ఈ కవర్ సాంగ్ పై ఓ లుక్ వేయండి.