టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తన జీవితంలో అత్యంత కీలకమైన దశలో ఉన్నారు. ప్రస్తుతం కాజల్ గర్భవతి. మరి కొద్ది రోజుల్లో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ప్రస్తుతం షూటింగ్ లకు దూరంగా.. ఇంట్లోనే ఉంటూ.. తన ప్రెగ్నెన్సీని ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం గర్భవతిగా ఉన్న కాజల్ తాజాగా తన సోదరి కుమారిడితో కలిసి చేసిన ఓరియో యాడ్ తెగ వైరలయ్యింది. దీనిలో కాజల్ బేబీ బంప్ క్లియర్ గా కనిపించింది. అంతేకాక దీనిలో కాజల్ కాస్త బొద్దుగా మారినట్లు క్లియర్ గా కనిపించింది. ఇక యాడ్ లో కాజల్ ని చూసిన వారు అందంగా ఉన్నావ్.. ప్రెగ్నెన్సీ టైమ్ ని ఎంజాయ్ చేయ్ అని కామెంట్స్ చేయగా.. మరి కొందరు మాత్రం ఆమెను ట్రోల్ చేయసాగారు. ఇలా తయారయ్యావేంటి.. అప్పుడే ఇంత లావయ్యావ్ అని విమర్శించసాగారు. ఇది కూడా చదవండి : బేబీ బంప్ తోనే కాజల్ యాడ్! వీడియో వైరల్! pic.twitter.com/MfDbYKy6vS — Kajal Aggarwal (@MsKajalAggarwal) February 9, 2022 నెగిటివ్ గా కామెంట్ చేసే వారికి కాజల్ సుతిమెత్తగానే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రెగ్నెన్సీ అనేది మహిళ జీవితంలో అత్యంత ముఖ్యమైన దశే కాక.. ఎంతో సంతోషాన్ని ఇచ్చే సమయం అని తెలిపారు. ఇలాంటి సందర్భంలో లావెక్కుతున్నాను.. శరీరంపై స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడుతున్నాయి.. మళ్లీ మునపటిలా నాజుగ్గా మారగలనా లేదా అనే ఆలోచనలతో బుర్ర, మనసు పాడు చేసుకోవద్దని తెలిపారు. వీట్నింటికంటే ఎంతో ముఖ్యమైనది.. మరో ప్రాణిని మహిళ ఈ లోకంలోకి తీసుకువస్తుందని.. ఇది అన్నింటికంటే ఉత్తమమైంది అన్నారు. ఇది కూడా చదవండి : కాజల్ అగర్వాల్ ప్రెగ్నెంట్.. ఫోటో షేర్ చేసిన భర్త ఇలాంటి సమయంలో మీ గురించి వినిపించే విమర్శలు పట్టించుకోకుండా.. మీకు ఇష్టమైన వారితో సంతోషంగా గడపాలని.. డాక్టర్ సూచన మేరకు యోగా, మసాజ్ వంటివి ఫాలో కావాలని.. క్రమం తప్పకుండా వాకింగ్ చేయాలని.. ఇవన్ని మనసును ప్రశాంతంగా ఉంచడమే కాక.. గర్భంలోని బిడ్డతో మీ అనుబంధాన్ని బలపరుస్తాయని తెలిపారు కాజల్. ఈ మేరకు ఆమె తన ట్విటర్ లో సుదీర్ఘమైన లేఖను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది వైరలవ్వడమే కాక.. కాజల్ కు మద్దతుగా కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. కాజల్ చేసిన పోస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.