సైనా నెహ్వాల్‌ పై హీరో సిద్ధార్థ హద్దులు మీరిన ట్వీట్‌..

Sdharth Tweet viral on Saina Nehwal

పంజాబ్‌ లో ప్రధాని మోదీ ఓ వంతెనపై 20 నిమిషాలు నిలుచుండిపోవడం దేశవ్యాప్తంగా ఎంత చర్చకు దారి తీసిందో అందరికీ తెలిసిందే. ప్రధాని భద్రత అంటే దేశ భద్రత.. అంటూ ఎంతో మంది ఆ ఘటనను ఖండించిన విషయం తెలిసిందే. రాజకీయ నాయకుల నుంచి సెలబ్రిటీలు, క్రీడాకారులు అందరూ తమ అభిప్రాయాలను సోషల్‌ మీడియాలో ప్రస్తావించారు. అదే అంశంపై ఒలింపిక్‌ మెడలిస్ట్‌ సైనా నెహ్వాల్‌ కూడా తన అభిప్రాయాన్ని తెలియజేసింది.

‘ఏ దేశం కూడా తమ ప్రధాని భద్రతే సరిగ్గా లేనప్పుడూ తాము సురక్షితంగా ఉన్నట్లు ప్రకటించుకోలేదు. నేను ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాను’ అంటూ సైనా నెహ్వాల్‌ ట్వీట్‌ చేసింది. ఏపీలో సినిమా టికెట్ల విషయం మొదలుకొని చాలా అంశాలపై హీరో సిద్ధార్థ ట్వీట్టర్‌ వేదికగా స్పందిస్తూనే ఉన్నాడు. ఈ విషయంలో మాత్రం కాస్త తీవ్రంగా, అనాలోచితంగా స్పందించాడు అంటూ కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. ఒలంపిక్‌ మెడలిస్ట్‌ ను అలాంటి మాటలు మాట్లాడతావా అంటూ ట్రోల్‌ చేస్తున్నారు.

‘Subtle Cock Champion Of The World’ అంటూ సిద్ధార్థ వ్యంగాస్త్రాలు సంధించాడు. భగవంతుడా.. దేశాన్ని కాపాడే వీరులు ఉన్నారు.. అంటూ సిద్ధార్థ ట్వీట్‌ చేశాడు. చాలా మంది హీరో తీరును ఖండిస్తున్నారు. సైనా నెహ్వాల్‌ విషయంలో సిద్ధార్థ హద్దులు దాటి కామెంట్‌ చేశాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హీరో సిద్ధార్థ స్పందనపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.