జైలుకెళ్లాల్సిందే…హీరో మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు

ఈ సారి మా ఎన్నికలు కాస్త రసవత్తర పోరుకు తలపిస్తున్నాయి. గత మా ఎన్నికలను మించి కొత్తగా మారబోతున్నాయని తెలుస్తోంది. ఇప్పటకే పోటీలో చాలా మందే ఉన్నారు. ఇక ప్రత్యక్ష ఎన్నికలను మించిపోతున్న ఈ ఎన్నికల్లో ఇప్పుడే ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. మా ఎన్నికలకు ఇంకా చాల కాలమే ఉన్నా..పోటీకి మాత్రం ఇప్పటి నుంచే కాలు దువ్వుతున్నారు పోటీదారులు. మొదట్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని ప్రకాష్ రాజ్ ప్రకటించారు.

Manchu Vishnu On Maa Elections 01 minవెనువెంటనే మంచు వారి అబ్బాయి మంచు విష్ణు నేను కూడా పోటీలోకి దిగబోతున్నానని తెలిపారు. దీంతో మేము కూడా ఏం తక్కువ కాదన్నట్లుగా జీవితా రాజశేఖర్, హేమా వంటి సీనియర్ మహిళా నటులు కూడా పోటీకి సై అంటున్నారు. ఇదిలా ఉండగానే అందరి కంటే ముందుగానే ఒకడు ముందుకేసాడు ప్రకాష్ రాజ్. అందరికంటే ముందుగానే తన పానెల్ ను కూడా ప్రకటించి మా ఎన్నికల్లో కాస్త హీట్ పెంచారు. ఇక అప్పటి నుంచి ఒకరిపై ఒకరు మాటల దూషణలు చేసుకోవడం మొదలుపెట్టారు.

ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు విష్ణు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. నన్ను మొదట్లో మా ఎన్నికల్లో పోటీ చేయాలని కొందరు సినీ పెద్దలే సూచించారని తెలిపారు. కానీ ఉన్నట్టుండి కొందరు పోటీలోకి వచ్చారని అన్నారు. నేను చాలా మందికి సాయం చేశానని, కానీ నేడు వాళ్ళు మళ్ళీ శృతిమించితే జైలుకు జైలుకెళ్లాల్సిందే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో సినీ పరిశ్రమకు ఏదైనా ఆపద వచినప్పుఫు ఎన్టీఆర్, దాసరి నారాయణ రావు, ఏఎన్నార్ వంటి నటులు ముందుకొచ్చేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అన్నారు హీరో మంచు విష్ణు.