హీరో అజిత్ కి రష్యన్ అభిమాని అపురూప కానుక!

తెలుగు, తమిళ ఇండస్ట్రీలో హీరో అజిత్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అజిత్ పుట్టింది పెరిగింది హైదరాబాద్ లో అయినా హీరోగా తమిళ నాట స్థిరపడ్డాడు. అజిత్ మొదటి చిత్రం ‘ప్రేమ పుస్తకం’ఆ చిత్రం పెద్దగా పేరు తీసుకు రాలేకపోయింది. తర్వాత తమిళ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి వరుస విజయాలు అందుకున్నాడు. సినీ ఇండస్ట్రీలో బాలనటిగా పాపులర్ అయిన షాలినిని 2000 సంవత్సరంలో పెళ్ళి చేసుకున్నాడు. నాలుగు పదుల వయసు దాటి, జుట్టు మొత్తం తెల్లబడినా.. రంగు వేసుకోకుండా అలాగే హీరో పాత్రలు పోషిస్తున్నాడు.

ajith compressedతెలుగు,తమిళ నాటనే కాదు ప్రపంచ వ్యాప్తంగా అజిత్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. తాజాగా అజిత్ కోసంఓ రష్యన్ అభిమాని ఇచ్చిన గిఫ్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మన హీరోల అభిమానం ఎల్లలు దాటుతున్నాయని తెగ సంబరపడిపోతున్నారు. ప్రస్తుతం అజిత్ “వాలిమై” సినిమా షూటింగ్ లో ఉన్నారు. ఈ సినిమా తుది షూటింగ్ కోసం చిత్ర బృందం కొన్ని రోజుల క్రితం రష్యా వెళ్లింది. అజిత్ పాల్గొన్న అతి పెద్ద బైక్ ఫైట్‌లు మాస్కో సమీపంలోని కొలొమ్నాలో చిత్రీకరించారు. రష్యాలో “వాలిమై”చిత్ర బృందానికి అలెక్స్ రష్యన్ డ్రైవర్ గా కొనసాగారు. రష్యాలో షూటింగ్ జరుగుతున్నంత వరకు అలెక్స్ హీరో అజిత్ ని బాగా గమనిస్తూ వచ్చారట.

ajith1 compressedహీరో అజిత్ నిజాయితీ.. మంచితనం.. అందరితో కలిసిపోవడం ఎంతో బాగా నచ్చిందట.. అంతే అప్పటి నుంచి హార్డ్ కోర్ ఫ్యాన్ గా మారిపోయాడట. షూటింగ్ పూర్తయిన సందర్భంగా అజిత్ కి రెండు టీ షర్టులు, ఒక కప్పు టీ, ఓ ప్రసిద్ధ చాక్లెట్ బహుమతిగా ఇచ్చారు. ఆ షర్ట్ పై “అజిత్ ది బెస్ట్” అని రాసుంది. అంతేకాదు కొలొమ్నా మిమ్మల్ని ఇష్టపడుతోంది అని కూడా ఉంది. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బోనీకపూర్ నిర్మాణంలో.. దర్శకుడు హెచ్. వినోద్, యువన్ శంకర్, నిరవ్ షా కాంబోలో రూపొందుతున్న రెండవ చిత్రం “వాలిమై’’. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్స్, టలు, టీజర్‌లు, ట్రైలర్లు విడుదల చేయడానికి సిద్ధమవుతోంది చిత్రబృందం.