ఫస్టు సింగిల్ కి ముహూర్తం – అఖండ’ నుంచి మరో సర్‌ప్రైజ్!..

బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘అఖండ’. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ చిత్రం. . ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ముఖ్యంగా టైటిల్ రోర్ టీజర్‌లో అఘోర పాత్రలో ఆకట్టుకున్నారు. ఆయన చెప్పిన డైలాగ్, థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఈ టీజర్‌కి హైలైట్‌గా నిలిచాయి. ఇందులో బాలకృష్ణ రైతు పాత్రతో పాటు అఘోరాగానూ కనిపించనున్నారు. ఉగాది పండగ సందర్భంగా విడుదల చేసిన  ‘అఖండ’ టైటిల్‌ రోర్ యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. 50 మిలియన్‌ వ్యూస్‌ని దాటినట్లు చిత్ర నిర్మాణ సంస్థ తెలిపింది. ఇప్పటికే ఈ టీజర్లతో ఫుల్ ఖుషీలో ఉన్న బాలకృష్ణ ఫ్యాన్స్‌కి చిత్ర యూనిట్ త్వరలో మరో సర్‌ప్రైజ్ ఇవ్వనుందట. ఈ సినిమా నుంచి మొదటి పాటని విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని మే 28న విడుదల చేస్తున్నట్లు సమాచారం. నిజానికి ఈ డేట్‌కి సినిమానే రిలీజ్ చేద్దామని ప్లాన్ చేశారు. కానీ, కరోనా కారణంగా అంతరాయం ఏర్పడటంతో అది కుదరేదు. అందుకోసం ఆ రోజు సినిమా ఫస్ట్ సింగిల్‌ని విడుదల చేస్తున్నారు. ఇక ద్వారక క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా నటి పూర్ణ ఓ ప్రధాన పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాలో శ్రీకాంత్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు.