సాధారణంగా సినిమాల్లో నటించే హీరో, హీరోయిన్లను చూడాలని, కుదిరితే ఓ ఫోటో కూడా దిగాలని ప్రతి ఒక్కరికి ఓ ఆశ ఉంటుంది. కొందరికైతే ఎప్పటికైన కలవాలనే బలమైన సంకల్పం కూడా లేకపోలేదు. ఇలా అభిమానం ఉంటే తప్పు లేదు. కానీ ఇదే పిచ్చి అభిమానంతో కొందరు ఆకతాయిలు హీరోయిన్లను అసహనానికి గురయ్యే విధంగా ప్రవర్తిస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అచ్చం ఇలాంటి ఆకతాయిలే హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కు షాకిచ్చి ఏకంగా ఆమె కారు టైర్లలో గాలి తీసేశారు. తాాజాగా జరిగిన ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
ఇక విషయం ఏంటంటే? టాలీవుడ్ లో శతమానం భవతి ,ఉన్నది ఒకటే జిందగీ వంటి మరికొన్ని విజయవంతమైన సినిమాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. ఈ అందాల బామ తాజాగా కోదాడ, సూర్యాపేటలో ఓ షాప్ ఓపెనింగ్ వేడుకకు హాజరైంది. దీంతో ఈ హీరోయిన్ ను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. స్థానికులు, అభిమానులు తమ మొబైల్ కెమెరాల ద్వారా ఆమెతో సెల్ఫీలు దిగేందుకు సైతం పోటీ పడ్డారు. ఈ క్రమంలో ఆమె మరింత సమయం అక్కడే ఉండాలని ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేశారు.
ఇది కూడా చదవండి: భర్తతో గొడవలపై స్పందించిన సుమ! విడిపోవడం సులభమే అంటూ..!
అయితే, అప్పటికే చాలా ఆలస్యమైపోవడంతో ఆమె అక్కడ నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధమైంది. దీంతో కొందరు అకతాయిలు ఆమె ప్రయాణించే కారు టైర్లలో గాలితీశారు. దీంతో అనుపమ పరమేశ్వరన్ అసహనానికి గురయ్యింది. అనంతరం షాపు నిర్వాహకులు ఆమెకు మరో కారు ఏర్పాటు చేసి హైదరాబాద్కు పంపించారు. ఇలా నటీనటులు అసహనానికి గురయ్యే విధంగా ప్రవర్తించకూడదంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ కు షాకిచ్చిన అభిమానుల తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.