చిత్ర పరిశ్రమలో ఉన్న కళాకారులు ఏ చిన్న మాట తప్పుగా మాట్లాడినా అది క్షణాల్లో వైరల్ అవుతుంది. అదీ కాక ఆ మాట కొన్ని కొన్ని సందర్భాల్లో రెండు మతాల మధ్య ఘర్షనలకు సైతం దారితీస్తుంది. ఈ క్రమంలో ఓ ప్రముఖ స్టంట్ మాస్టర్ గతంలో చేసిన ప్రసంగం అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. ఆ ప్రసంగం రెండు మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఉందని అతని పై కేసు పెట్టారు. అందులో భాగంగానే తాజాగా అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మరిన్ని వివరాల్లోకి వెళితే.. కనల్ కణ్ణన్.. చిత్ర పరిశ్రమలో పేరు పొందిన ఫైట్ మాస్టర్. కనల్ ఆగస్టు 1 వ తారిఖున మధురవాయల్ లో జరిగిన ఓ సభలో పాల్గోన్నారు. ఆ సభలో ఆయన ప్రసంగిస్తూ.. శ్రీరంగ ఆలయ ద్వారం వద్ద ఉన్న పెరియార్ విగ్రహాన్ని పగలగొట్టి, తొలగించిన రోజు హిందువుల విద్రోహ దినం అవుతుందన్నారు. ఆ ప్రసంగం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఈ మాటల పై అభ్యంతరం తెలుపుతూ ఫాదర్ పెరియార్ ద్రవిడర్ కజగం జిల్లా కార్యదర్శి కుమరన్ చెన్నై పోలీస్ లకు ఫిర్యాదు చేశాడు. ఈ నేఫథ్యంలోనే అతన్ని అరెస్టు చేశారు. అదే విధంగా కనల్ కణ్ణన్ రెండు మతాల మధ్య గొడవలు జరిగేలా మాట్లాడినందుకు అతడిపై రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 153 అల్లర్లను ప్రేరేపించడం, ఐపీసీ505(1)(బి) శాంతికి భంగం కలిగించడం లాంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి కనల్ పరారీలో ఉన్నాడు. అతడ్ని పాండిచ్చేరిలోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో ఉన్నట్లు గుర్తించి అతన్నిసైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. Chennai police’s Cyber crime wing arrested Kollywood stunt choreographer and Tamil Nadu President of Hindu Munnani’s art and culture wing, Kanal Kannan at Puducherry on Monday. His video of controversial remarks against Periyar statue outside Srirangam temple, went viral @dt_next pic.twitter.com/qfInkAiQLt — Srikkanth (@Srikkanth_07) August 15, 2022 ఇదీ చదవండి: Salaar: ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగే.. ‘సలార్’ రిలీజ్ డేట్ వచ్చేసింది!