ఈ భూమిపై దేవుడికి మారుగా తల్లిని సృష్టించారని అంటారు.. తన పిల్లలకు చిన్న కష్టం వచ్చినా ఆమె కళ్లలో నిళ్లు తిరుగుతాయి. ఏ కష్టం రానివ్వకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటుంది తల్లి. అలాంటి తల్లి తాను జన్మినిచ్చిన కొడుకును అత్యంత దారుణంగా చంపిందన్న ఆరోపణలతో ఓ మాజీ పోర్న్ స్టార్ అరెస్ట్ అయింది. ఈ దారుణమైన ఘటన ఇటలీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కటాలిన్ ఎర్జ్‌బెట్ బ్రాడాక్స్ అనే మాజీ పోర్న్ స్టార్ ఇటీవల తన భర్తతో విపోయింది.
తనతో విడాకులు తీసుకున్న తర్వాత కటాలిన్ తన కొడుకు అలెక్స్‌తో ఇటలీలో ఉంటుందని ఆమె మాజీ భర్త నార్బర్ట్ జుహాజ్ తెలిపారు. కటాలిన్, నార్బర్ట్ విడిపోయి.. అలెక్స్ పెంపకంపై న్యాయ పోరాటం చేస్తున్నారు. గత కొంత కాలంగా తనను విపరీతంగా టార్చర్ పెడుతుందని. ఈ క్రమంలోనే ఓ సూపర్ మార్కెట్లో తీవ్రమైన కత్తి గాయాలతో ఉన్న తన రెండేళ్ల బాలుడు అలెక్స్ జుహాజ్తో కనిపించిందికటాలిన్. తన కుమారుడిని కాపాడాలంటూ కేకలు వేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. అప్పటికే ఆ బాలుడు మృతి చెందాడు.
సూపర్ మార్కెట్ పక్కన ఉన్న ఓ భవనంలో అలెక్స్‌కు సంబంధించిన రక్తపు టీ షర్టు పోలీసులకు లభ్యమైంది. అలెక్స్ మృతదేహంపై 9 గాయాలు ఉన్నట్లు గుర్తించారు. అయితే తన కొడుకును సొంత తల్లి కటాలిన్ హత్య చేసినట్లు ఆమె మాజీ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కటాలిన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై దర్యాప్తు జరిపిన పోలీసులకు ఆమె పర్స్‌లో కత్తి కనిపించడంతో స్వాధీనం చేసుకున్నారు. తన మీది ఉన్న కోపంతోనే అలెక్స్‌ను చంపి ఉంటుందని నార్బర్ట్ ఆరోపించాడు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న కటాలిన్ నార్బర్ట్ ఆరోపణలను ఖండించింది.