దక్షిణాది చిత్ర పరిశ్రమలో KGF సినిమా రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిన్న సినిమాగా విడుదలై అంచనాలను తలకిందులు చేస్తూ బ్రహ్మండమైన విజయాన్ని అందుకుని భారీ వసూళ్లను సైతం రాబట్టింది. ఇక ఊహించని విజయాన్ని సాధించిన ఈ సినిమాకు పార్ట్ 2 ని కూడా తెరకెక్కించాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. KGF చాప్టర్ 2 గురువారం విడుదలయ్యింది. ఈ సినిమాకు క్రేజ్ ఎలా ఉందంటే.. ఫస్ట్ డే ఈ సినిమాను చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా సుమారు 40 లక్షలకు పైగా టిక్కెట్లు బుక్ చేసుకున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: ఫస్ట్ డే కలెక్షన్స్ లో ఆల్ టైమ్ రికార్డు సృష్టించిన కేజీఎఫ్ ఛాప్టర్ 2!
సినిమా క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని పార్ట్ 3 కూడా ఉన్నట్లు దర్శకుడు KGF చాప్టర్ 2 ఎండ్ కార్డ్స్‌లో హింట్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో KGF సినిమాలో యష్ తల్లి పాత్రకు డబ్బింగ్ చెప్పిన అమలా నాయుడు ఆసక్తికర అంశం వెల్లడించారు. కేజీఎఫ్ 12 చాప్టర్లు ఉండనున్నట్లు తెలిపారు. సుమన్‌టీవీకిచ్చిన(SumanTV) ఎక్స్‌క్లూజీవ్ ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: బాలీవుడ్ లో KGF-2 కలెక్షన్స్ సునామీ! బీ-టౌన్ గాలి తీసిన RGV ట్వీట్!
కేజీఎఫ్ సినిమాలో యష్ తల్లి పాత్ర చాలా కీలకం. హీరో జీవితాన్ని ప్రభావితం చేసే క్యారెక్టర్ ఇది. తల్లి చెప్పిన మాటతో ఓ సామాన్యుడు సుల్తాన్‌గా మారతాడు. అలాంటి గొప్ప క్యారెక్టర్‌కు డబ్బింగ్ చెప్పడం తన అదృష్టం అన్నారు అమలా నాయుడు. ఇక కేజీఎఫ్ కథాపరంగా చాలా చాప్టర్లు ఉన్నాయని.. కానీ దర్శకులు ఎన్ని చాప్టర్లు తీస్తారో తనకు తెలియదు అన్నారు. అంతేకాక సినిమా మేకింగ్‌కు సంబంధించి పలు ఆసక్తికర అంశాలు పంచుకున్నారు. పూర్తి వివరాల కోసం ఈ కింద వీడియో చూడండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.