Drushyam 2 Movie Review: ‘దృశ్యం’ను మించిన ట్విస్టులు! దృశ్యం 2 అదిరింది.

ఓ సినిమాకి ఆరేళ్ళ తర్వాత సీక్వెల్ తీయడం అంటే సాహసమనే చెప్పాలి. నిజానికి సీక్వెల్స్ సక్సెస్ అయిన సందర్భాలు కూడా చాలా తక్కువ. అయితే.., ఈ భయాలను, సెంటిమెంట్ ని పక్కన పెట్టి.. దృశ్యం మూవీకి సీక్వెల్ గా దృశ్యం-2 తెరకెక్కించారు మేకర్స్. తాజాగా ఆ ఈ మూవీ ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ నేపథ్యంలో మరి.. ఇప్పుడు దృశ్యం 2 ఎలా ఉందొ ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.

agsagsag minకథ:

రాంబాబు కుటుంబం వరుణ్ హత్య కేసునుండి బయట పడటంతో దృశ్యం కథ ముగిసింది. సరిగ్గా అక్కడ నుండే దృశ్యం-2 కథ మొదలవుతుంది. ఈ ఆరేళ్ళ కాలంలో రాంబాబు ఆర్ధికంగా నిలదొక్కుకుంటాడు. ఓ ధియేటర్ కి ఓనర్ అవుతాడు. తానే సొంతంగా ఓ సినిమా నిర్మించాలని సొంతగా కథ సిద్ధం చేస్తుంటాడు. ఇలా.. పోలీసులు ఇక తనని పట్టుకోలేరని రాంబాబు నమ్మకంగా ఉంటాడు. కానీ.., అంతకు రెండేళ్ల ముందు నుండే పోలీసులు రాంబాబు కోసం సీక్రెట్ ఆపరేషన్ స్టార్ట్ చేసి ఉంటారు పోలీసులు.

అనుకోకుండా రాంబాబు, అతను కుటుంబం ఆ ట్రాప్ లో చిక్కుకుంటారు. దీంతో.., వీరికి మళ్ళీ కష్టాలు మొదలవుతాయి. మరి.. ఈసారి కూడా రాంబాబు తన సినిమా నాలెడ్జ్ తో తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు? అసలు అతను సినిమా కోసం రెడీ చేసిన కథ.. తనని ఎలా సేవ్ చేసింది? అసలు రాంబాబు పోలీసులను ఎలా బురిడీ కొట్టించి తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు అన్నదే దృశ్యం 2 కథ.

fagg minవిశ్లేషణ:

థ్రిల్లర్ సినిమాలకి కావాల్సింది సస్పెన్స్. ఆ సస్పెన్స్ కి ఒక బలమైన సెంటిమెంట్ యాడ్ అయితే ఆ బొమ్మ సూపర్ హిట్. దృశ్యం, , దృశ్యం 2 కి ఇదే ప్రధానమైన బలం. ఇక కథ మొత్తాన్ని ప్రభావితం చేసే ఆ ట్విస్ట్ పాయింట్ దృశ్యం-2 లో అదిరిపోయింది. స్టోరీ, స్క్రీన్ ప్లే పరంగా దృశ్యం-2 లో ఒక్క చిన్న పొరపాటు కూడా లేకపోవడం విశేషం. దర్శకుడు అంత పక్కాగా ఈ కథని రాసుకున్నాడు. ఇక ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఫస్ట్ హాఫ్ ని నడిపించి.. కథ ఎస్టాబ్లిష్ మెంట్ కి కాస్త సమయం తీసుకున్నాడు దర్శకుడు. కానీ.., సెకండ్ ఆఫ్ లో సినిమా పరుగులు తీస్తుంది. మొత్తంగా జీతూ జోసెఫ్.. రెండో భాగానికి అద్భుతమైన సన్నివేశాలతో పాటు స్క్రీన్ ప్లే సమకూర్చుకున్నారు. మొత్తంగా ‘దృశ్యం’ మాదిరే ‘దృశ్యం 2’ కూడా ప్రేక్షకులను అలరిస్తోందనే చెప్పాలి.

ముఖ్యంగా ఇందులో విక్టరీ వెంకటేశ్ నటనకి ఎవరైన హేట్సాఫ్ చెప్పాల్సిందే. వెంకీ కళ్ళతో ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ ఒక రేంజ్ లో ఉన్నాయి. ఇక మీనా కూడా తనదైన నటనతో ఆకట్టుకుంది. నదియా, సీనియర్ నరేష్, సంపత్ రాజ్, తనికెళ్ల భరణి తమ పరిధి మేరకు నటించారు. టెక్నీకల్ గా దృశ్యం 2 కి మంచి టీమ్ దొరికింది. ఇన్ని అంచనాలను క్యారీ చేస్తూ.., ఇంత గొప్ప సీక్వెల్ ను తీసిన జీతూ జోసెఫ్ కి నిజంగా అభినందనలు దక్కాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

  • విక్టరీ వెంకటేశ్
  • కథ
  • నటీనటుల నటన
  • స్క్రీన్ ప్లే, కెమెరా పనితనం
  • జీతూ జోసెఫ్ డైరెక్షన్

మైనస్ పాయింట్స్ :

  • ఫస్ట్ హాఫ్ కాస్త స్లో అవ్వడం
  • అక్కడక్కడ మిస్ అయిన సస్పెన్స్

చివరి మాట:

దృశ్యం-2 పర్ఫెక్ట్ సీక్వెల్. తప్పక చూడొచ్చు.