ఆ హిట్ సినిమాలు మిస్ చేసుకుని నాని బాధపడుతున్నాడా?

తెలుగు ఇండస్ట్రీలో అష్ట్రాచమ్మ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాని తర్వాత వరుస విజయాలతో మంచి ఫామ్ లో కొనసాగుతున్నాడు. సాధారణంగా ఇండస్ట్రీలో ఎలాంటి స్టార్ హోదాలో ఉన్నవారైనా కొన్ని సూపర్ హిట్ చిత్రాలను మిస్ చేసుకుంటారు. తమ వద్దకు వచ్చిన హిట్ సినిమాలను చేతులారా వదిలేసి ప్లాఫ్ సినిమాలవైపు అడుగులు వేస్తుంటారు.

Tuck Jagadishఅలాంటి వారిలో నాని కూడా ఉన్నారట. ఈ విషయం స్వయంగా ఆయనే చెప్పారు. ప్రస్తుతం తన అప్ కమింగ్ రిలీజ్ ‘టక్ జగదీష్’ ప్రచారంలో ఉన్న నాని ఈ విషయాన్ని వెల్లడించారు. టాలీవుడ్‌లో ప్రస్తుతం తను ఉన్న స్థాయి పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు నాని. తొలి చిత్రం ‘అష్టా చెమ్మ’ నుండి గత చిత్రం ‘వి’ వరకు చేసిన ప్రతి సినిమాని తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని అంటున్నాడు. ‘ఎఫ్‌ 2’, ‘రాజా రాణి’ సినిమాలు తన కెరీర్ లో మిస్ అయ్యానని.. ఈ సినిమాల మేకర్స్ తమ సినిమాలో నటించమని కోరినపుడు వాటిలో నటించే పరిస్థితిలో తను లేకపోవడం వల్ల తిరస్కరించానంటున్నాడు.

ఆ రెండు సినిమాలు మంచి హిట్ అవుతాయని ముందుగానే భావించినా సమయం అనుకూలించక వదిలివేయాల్సి వచ్చిందని బాధపడ్డారు. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహించిన తన గత చిత్రం ‘వి’ ఫలితం పట్ల సంతోషంగానే ఉన్నాడట. మరి వినాయకచవితి కానుకగా వస్తున్న ‘టక్ జగదీష్’ నాని కెరీర్ లో మరో మంచి విజయం అవుతందా.. ఫ్లాప్ టాక్ వస్తుందా చూడాలి. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్, రీతూ వర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీలో మరో ముఖ్యపాత్రలో జగపతిబాబు నటిస్తున్నాడు.