అవును..! మీరు చదివింది నిజమే.. గాడ్ ఫాదర్ ఎవరు!? అనే డౌట్ మీకు వచ్చింది.. కదూ. అదేనండీ బాబు ఆ గాడ్ ఫాదర్ మన మెగాస్టార్ చిరంజీవి గారే. ప్రస్తుతం ఆయన మలయాళంలో సూపర్ హిట్ అయిన “లూసిఫర్” సినిమాని తెలుగులో చేస్తున్నారు.. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు.. ఈ చిత్రానికి “గాడ్ ఫాదర్” అనే పవర్ఫుల్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. చిరంజీవి బర్త్ డే సందర్బంగా ఆగస్ట్ 22న విడుదల చేసిన “గాడ్ ఫాదర్” టైటిల్ మోషన్ పోస్టర్‌కు సోషల్ మీడియాలో అధ్బుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమాలో పవర్ ఫుల్ పాత్రలో చిరంజీవి కనిపించబోతోన్నారు. చిరంజీవి 153వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకాలపై సురేఖ కొణిదెల సమర్పణలో ప్రముఖ నిర్మాతలు ఆర్ బి చౌదరి, ఎన్వీ ప్రసాద్ అత్యంత భారీ బడ్జెట్.. హైటెక్నికల్ వాల్యూస్ తో నిర్మిస్తున్నారు.
ఇంతటి మోస్ట్ క్రేజీ యెస్ట్ ప్రాజెక్ట్ గా రూపొందుతోన్న ఈ చిత్రంలో మెగాస్టార్ సరసన గ్లామర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తుంది.. యువ సంచలన సంగీతకెరటం తమన్ యస్ యస్ అత్యద్భుతమైన స్వరాలను సమకూరుస్తున్నారు.. మొట్ట మొదటిసారి తమన్ మెగాస్టార్ సినిమాకి మ్యూజిక్ చేయడం విశేషం.. ఆ కసితోనే చిరంజీవి గారి బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్లుగా, మెగా ఫ్యాన్స్ ఎంజాయ్ చేసేలా.. సరికొత్త ట్యూన్స్ కంపోజ్ చేస్తున్నారు తమన్.. ఈ సినిమాతో తన కెరియర్ బెస్ట్ మ్యూజిక్ చేస్తానని తమన్ సన్నిహిత వర్గాలతో అన్నట్లు తెలుస్తోంది.. ఇకపోతే ఈ చిత్రయానికి సంభందించి హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జైలుకి సంధించిన సీన్స్, కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌ని చిత్రీకరించారు. ప్రస్తుతం “గాడ్ ఫాదర్” షూటింగ్ గోవాలో సుందరమైన లొకేషన్స్‌లో జరుగుతోంది.. సినిమాకి సంబంధించి కొన్ని ముఖ్యమైన కీలక సన్నివేశాల్ని అక్కడ చిత్రీకరిస్తున్నారు. అక్టోబర్ 3 వరకు ఈ షెడ్యూల్ జరుగుతుంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ నీరవ్ షా కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. సురేష్ సెల్వరాఘవన్ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మోహన్ రాజా
నిర్మాతలు: ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్
సమర్ఫణ : కొణిదెల సురేఖ
బ్యానర్స్ : కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిల్మ్స్
సంగీతం : ఎస్ఎస్ తమన్
సినిమాటోగ్రఫర్ : నీరవ్ షా
ఆర్ట్ డైరెక్టర్ : సురేష్ సెల్వరాఘవన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : వాకాడ అప్పారావ్, పీఆర్వో : వంశీ-శేఖర్