స్టార్ హీరోల మెడకు చుట్టుకున్న ‘దిశ రేప్​’ కేసు?

complaint against cini stars for revealing identity of rape victim - Suman TV

2019 సంవత్సరం లో హైదరాబాద్ నగరంలో ఓ యువతిని మాయమాటలతో మభ్య పెట్టి సామూహిక అత్యాచారం చేసిన సంగతి తెలిసిందే. అత్యాచారం చేసిన దుండగులు ఆ యువతిని దారుణంగా హింసించి బతికి ఉండగానే దహనం చేశారు. రాష్ట్రాలతోపాటూ… దేశం మొత్తాన్నీ కదిలించిన ఘటన అది. ఈ అత్యాచారాలపై దేశం మొత్తం రగిలిపోయింది. ఈ దారుణ మారణ కాండకు వెంటనే జర్జిమెంట్ ఇవ్వాలని.. నింధితులను ఎన్ కౌంటర్ చేయాలని ప్రజలు డిమాండ్ చేశారు.

ఈ క్రమంలో సీన్ రీ కన్‌స్ట్రక్షన్ కోసం నిందితులను స్పాట్ కి తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు తమ దగ్గర నుంచి ఆయుధాలను లాక్కొని… తమపై కాల్పులు జరపబోతుంటే… ఆత్మరక్షణలో భాగంగా తామూ కాల్పులు జరిపామని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే తాజాగా దిశ రేప్ కేసు పై కొత్త వివాదం మొదలైంది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, టాలీవుడ్ స్టార్ లు రవితేజ మరియు రకుల్ ప్రీత్ సింగ్ సహా మరో 38 మంది పై కేసు నమోదైంది. అదేంటీ దిశ హత్య, రేప్ కేసులతో వీరికేంటీ సంబంధం అని ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.

complaint against cini stars for revealing identity of rape victim - Suman TVఅయితే బాధితురాలి పేరును సోషల్ మీడియాలో బహిర్గతం చేసినందుకుగాను ప్రముఖులను అరెస్టు చేయాలని కోరుతూ ఢిల్లీ తీజ్ హజారీ కోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు న్యాయవాది గౌరవ్ గులాటి. అంతేకాదు సెక్షన్ 228 ఏ కింద ప్రముఖుల పై కేసు నమోదు చేయాలని… సబ్జీ మండి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో బాలీవుడ్, టాలీవుడ్ నటులు మాత్రమే కాదు క్రీడా రంగానికి చెందిన ప్రముఖల పేర్లు కూడా నమోదు అయ్యాయి. ప్రస్తుతం ఈ వ్యవహారం.. అందరినీ షాక్ కు గురిచేస్తోంది.