టీకా వేయించుకుంటే బంగారం, బైకు! ఎక్కడో తెలుసా?

కరోనా మహమ్మారిని మట్టు పెట్టాలంటే ఇప్పుడు అందరి దగ్గరా ఒకే ఒక్క ఆయుధం ఉంది. అదే వ్యాక్సినేషన్. మన దేశంలోకి కరోనా ప్రవేశించాక అతి తక్కువ కాలంలోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. కానీ.., నిన్న మొన్నటి వరకు వ్యాక్సిన్ కొరత ఎక్కువ ఉండింది. దీంతో.., ప్రజలు వ్యాక్సిన్స్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి. కానీ.., ఇప్పుడు ఆ లెక్క పూర్తిగా రివర్స్ అయిపోయింది. ఇప్పుడు కావాల్సినంత సంఖ్యలో వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ.., కొంత మంది ప్రజలు మాత్రం ఇంకా వ్యాక్సిన్ వేసుకోవడానికి భయపడుతున్నారు. ఇందుకు కారణం వారిలో ఉన్న అపోహలే. వ్యాక్సిన్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ తప్పవని జరుగుతున్న తప్పుడు ప్రచారం కారణంగా ఇలాంటి పరిస్థితిలు నెలకొన్నాయి. ఇలాంటి వారి ఆలోచనా విధానాల్లో మార్పు తీసుకుని రావడానికి ఓ స్వచ్ఛంద సంస్థ ముందుకి వచ్చింది. తమిళనాడు రాష్టంలోని చెన్నై శివారులో కోవళం అనే ఓ మత్య్సకారుల గ్రామం ఉంది. ఇక్కడ మొత్తం జనాభా 14,300. వీరిలో 18 సంవత్సరాలు పైబడిన వారు 6,400 మంది. వీరిలో ఇప్పటి వరకు కేవలం 58 మంది మాత్రమే టీకా తీసుకోగా మిగతా వారికి కరోనా టీకాపై భయాందోళనలు నెలకొన్నాయి.

va 2వైద్యాధికారులు ఈ ప్రాంతంలో ప్రజలకు నచ్చజెప్పాలని చూసినా వారిలో మార్పు రాలేదు. వైద్య అధికారులను గ్రామంలోకి రానివ్వకుండా అడ్డుకున్నారంటే వీరు వ్యాక్సిన్ ని ఎంతగా వ్యతిరేకిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. దీంతో వీరిలో మార్పు కోసం ఎస్ఎస్ రామ్దాస్ ఫౌండేషన్, ఎస్టిఎస్ ఫౌండేషన్, చిరాజ్ ట్రస్టు వంటి ఎన్జీవోలు అన్నీ కలసి ఓ వినూత్న ఆలోచన చేశాయి. ఈ ట్రస్ట్ టీకా వేయించుకున్న వారికి లక్కీ డ్రా ద్వారా బహుమతులు ఇవ్వడం ప్రారంభించింది. ముందుగా బిర్యానీతో ప్రారంభించిన ఈ లక్కీ డ్రా తర్వాత ఎక్కువ మందిని ఆకర్షించాలని మిక్సీ, గ్రైండర్, రెండు గ్రాముల బంగారం వరకు వెళ్ళింది. అంతేకాదు అందరికీ వ్యాక్సిన్ పూర్తయ్యాక లక్కీ డ్రా తీసి.. అందులో విజేతలకు రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషిన్, స్కూటర్లను బంపర్ ప్రైజ్గా అందిస్తామని ప్రకటించారు. ఇంత పెద్ద ఆఫర్లు ప్రకటించడంతో గ్రామస్థులు వ్యాక్సిన్ వేపించుకోవడానికి ముందుకి వస్తున్నారు. ఇప్పటికి 345 మంది వ్యాక్సిన్ తీసుకోగా మరో వారం రోజులలో మిగతా వారిని ఒప్పించి వ్యాక్సిన్ అందిస్తామని స్వచ్ఛంద సంస్థలు చెప్తున్నాయి. గతంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేపించుకునే మగవారికి ప్రభుత్వం ఇలానే నగదు చెల్లించేది. ఇప్పుడు వ్యాక్సిన్ విషయంలో కూడా ఇలాంటి పరిస్థితి రావడం నిజంగా విచిత్రంగా ఉంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.