అభిమానులు ఆందోళన పడొద్దు.. చిరంజీవి ట్వీట్

తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ హీరోలు అంటే ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. నిన్న 7 గంటల 30 నిమిషాల ప్రాంతంలో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ కు గురయ్యాడు. వెంటనే ఆయన్ని మాదాపూర్ మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకుని, అతడిని కాపాడుకునేందుకు చిరంజీవి, పవన్ కల్యాణ్, వరుణ్ తేజ్, నిహారిక కొనిదెల వెంటనే మాదాపూర్‌లోని మెడికవర్ ఆసుపత్రికి పరుగులు తీశారు.

saaai minఈ నేపథ్యంలో అల్లు అరవింద్ మీడియాలో ఏవేవో వార్తలు రాకుండా ఫ్యామిలీ నుంచి ఒకరు వచ్చి చెప్పాలి కాబట్టి.. నేను చెప్తున్నాను. మళ్లీ చెప్తున్నాను సాయి ధరమ్ తేజ్ క్షేమంగా ఉన్నాడు..” అని అపోలో దగ్గర మీడియాతో తెలిపారు అల్లు అరవింద్. ఇదిలా ఉంటే.. తన మేనల్లుడు, నటుడు సాయిధరమ్‌ తేజ్‌ ఆరోగ్యం నిలకడగానే ఉందని.. అభిమానులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు.

ఈ సందర్భంగా ‘‘సాయిధరమ్‌ తేజ్‌కు స్వల్పగాయాలయ్యాయని.. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడని.. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చిరు తెలిపారు. అభిమానులెవరూ కంగారు పడొద్దని.. త్వరలోనే సాయి ఆరోగ్యంతో తిరిగి ఇంటికి వచ్చేస్తాడని’’ అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.