మెగస్టార్ చిరంజీవి.. ఆయన గురించి చెప్పడానికి మాటలు చాలవు. స్వయంకృషికి నిలువెత్తు రూపం.. తెలుగు ప్రజలకు అన్నయ్య.. ఆపదలో ఉన్న వారిని ఆదుకునే ఆపద్భాంవుడు.. ఇలా చిరంజీవి గొప్పతనాన్ని వర్ణిస్తూ పోతే ఓ కావ్యం అవుతుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలోకి వచ్చి.. విలన్ పాత్రల్లో నటించి.. హీరోగా ఒక్కో మెట్టు ఎక్కుతూ.. అభిమానుల గుండెల్లో మెగాస్టార్ అనే స్థాయికి ఎదిగారు. జీవితంలో ఎదగాలి అనుకునే ప్రతి ఒక్కరికి ఆయన ఆదర్శంగా నిలిచారు. ఇక సమాజం కోసం ఎన్నో మంచి పనులు చేస్తూ.. ఆపదలో ఉన్న వారికి సాయం చేస్తూ.. రియల్ హీరోగా నిలాచారు. ఇక చిరంజీవి బర్త్‌డే అంటే కేవలం ఆయన కుటుంబ సభ్యులు మాత్రమే కాక.. తెలుగు ప్రజలందరూ జరుపుకునే వేడుక. ఆయనను ఓ హీరోగా కన్నా కూడా తమ ఇంటి బిడ్డగా భావిస్తారు. ఇక బాస్ డ్యాన్స్‌లోని గ్రేస్ గురించి ఎంత మాట్లాడినా తక్కువే. అన్నింటికి మించి ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం ఆయనను ఇండస్ట్రీ పెద్దగా మార్చింది. కానీ చిరు మాత్రం తనకు ఈ బిరుదుల, బాధ్యతలు వద్దు.. కళామాతల్లి బిడ్డగా సేవ చేసుకుంటే చాలు అని సున్నితంగా తిరస్కరించి.. తన వ్యక్తిత్వాన్ని చాటుకుంటారు. ఇక ప్రస్తుతం చిరంజీవి వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. హీరో కాక ముందు ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్ పాత్రల్లో కూడా మెరిశారన్నాం కదా. అయితే ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. హీరోగా మారక ముందు బాస్.. ఓ సీరియల్లో నటించారట. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట తెగ వైరలవుతోంది.ఇప్పటికే 150కిపైగా చిత్రాల్లో నటించిన చిరంజీవి.. కెరీర్ ప్రారంభంలో ఓ సీరియల్లో నటించాడనే విషయం చాలా కొద్ది మంది మాత్రమే తెలుసు. కెరీర్ ఆరంభంలో హిందీ సీరియల్ రజనీలో చిరు నటించారట. అయితే అది ఫుల్ లెంగ్త్ రోల్ కాదు.. ఒక్క ఎపిసోడ్ మాత్రమే.. అతిథి పాత్రలో మెరిశారట. ఆ తర్వాత ఆయనకు సినిమాల్లో వరుస చాన్స్‌లు రావడంతో.. హీరోగా మారారు. ఈ విషయం తెలిసిన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: చిరంజీవి బర్త్ డే సందర్భంగా వైరల్ అవుతున్న అభిమాని ఓపెన్ లెటర్! ఇది కూడా చదవండి: నా అన్నను, తమ్ముడిని ఏమైనా అంటే తాట తీస్తా.. నాగబాబు వార్నింగ్