బుల్లెట్ భాస్కర్.. మోస్ట్ టాలెంటెండ్ రైటర్ కమ్ కమెడియన్ గా తన కెరీర్ లో దూసుకుపోతున్నాడు. జబర్దస్త్ ద్వారా వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని కొన్నేళ్లుగా టీమ్ లీడర్‌గా కొనసాగుతున్నాడు. రైటర్, కమెడియన్ గానే కాకుండా బుల్లెట్ భాస్కర్ కు మిమిక్రీ మీద కూడా మంచి పట్టు ఉంది. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు వాయిస్ ను అచ్చు గుద్దినట్లు ఇమిటేట్ చేయగలడు. అంతటి టాలెంట్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న బుల్లెట్ భాస్కర్ జీవితంలో ఎన్నో చీకటి రోజులు ఉన్నాయి. ఒకానొక సమయంలో ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నాడంట. ఆ విషయాలను షోల వెల్లడించి అభిమానులను షాక్‌కు గురిచేశాడు. తన లవ్ ఫెయిల్యూర్ గురించి చెబుతూ.. ‘నేను రెండేళ్లపాటు ఒక అమ్మాయిన ఎంతో సిన్సియర్ గా ప్రేమించాను, తనతో కలిసున్నాను. రెండేళ్ల తర్వాత ఏమోందో ఏమో.. ఆ అమ్మాయి నన్ను వదిలేసి వెళ్లిపోయింది. నేను పిచ్చోడిలా రాజమండ్రి, వైజాగ్, విజయవాడ, హైదరాబాద్ ఊర్లు తిరుగుతూ ఉండేవాడిని. తలకు చాలా దెబ్బలు తగిలించుకున్నాను.. కుట్లు కూడా పడ్డాయి. ఆ సమయంలో నేను సూసైడ్ కూడా చేసుకోవాలనుకున్నాను.’ ‘లవ్ లో ఫెయిల్ అయితే మోసం చేసిన అమ్మాయిని కొట్టడం, తిట్టడం, వేధించడం చేస్తారు. కానీ, నేను అలా చేయలేదు. జీవితంలో ఉన్నతంగా ఎదగాలి అనుకున్నాను. నా ఎదుగుదలతోనే వారికి బుద్ధి చెప్పాలనుకున్నాను. అందుకే హైదరాబాద్ వచ్చా.. జబర్దస్త్ లో వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నాను. నా ఎదుగుదల నన్ను మోసం చేసిన వాళ్లను చెప్పుతో కొట్టినట్లు ఉండాలని భావించాను’ అంటూ బుల్లెట్ భాస్కర్ తన ఫెయిల్యూర్ లవ్ స్టోరీని వెల్లడించాడు. ప్రస్తుతం బుల్లెట్ భాస్కర్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. భాస్కర్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. బుల్లెట్ భాస్కర్ వైరల్ వీడియో కోసం క్లిక్ చేయండి.