బాలీవుడ్ స్టార్స్ రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ 'బ్రహ్మాస్త్ర'. దర్శకుడు అయాన్ ముఖర్జీ రూపొందించిన ఈ సోషియో ఫాంటసీ చిత్రాన్ని సౌత్ ఇండియాలో డైరెక్టర్ రాజమౌళి రిలీజ్ చేస్తున్నాడు. అలాగే తెలుగు సినిమాల మాదిరిగానే భారీ స్థాయిలో బ్రహ్మాస్త్ర మూవీని ప్రమోట్ చేస్తున్నాడు రాజమౌళి. తెలుగులో 'బ్రహ్మాస్త్రం' పేరుతో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా గురించి దేశవ్యాప్తంగా పాజిటివ్ బజ్, అడ్వాన్స్ బుకింగ్స్ భారీస్థాయిలో నమోదు అవుతున్నాయి. మరోవైపు సినిమా రిలీజ్ కి 3 రోజుల సమయం మాత్రమే ఉంది. ఇంతలో బ్రహ్మాస్త్ర ఫస్ట్ రివ్యూ అంటూ యూఏఈ క్రిటిక్ ఉమైర్ సంధు చేసిన ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కింగ్ నాగార్జున, షారుక్ ఖాన్, అమితాబ్, మౌని రాయ్ కీలక రోల్స్ చేశారు. అదీగాక సౌత్ లో బ్రహ్మాస్త్రం మూవీని చాలా సీరియస్ గా భారీ స్థాయిలో ప్రమోట్ చేస్తున్నాడు రాజమౌళి. ఇటీవలే ఎన్టీఆర్ గెస్ట్ గా బ్రహ్మాస్త్రం ప్రెస్ మీట్ జరిపారు మేకర్స్. ఇందులో బ్రహ్మాస్త్రం చిత్ర యూనిట్, రాజమౌళిలతో పాటు ఎన్టీఆర్, నాగార్జున కూడా పాల్గొన్నారు. ఇక ఇప్పటికే ట్రైలర్, సాంగ్స్ తో అంచనాలు పెంచిన ఈ సినిమా.. ఎలా ఉండబోతుందో అనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఈ క్రమంలో ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమైర్ సంధు తన ఫస్ట్ రివ్యూ ఇవ్వడం జరిగింది. అయితే.. బ్రహ్మాస్త్రంపై ఉమైర్ సంధు రివ్యూ చిత్రబృందాన్ని కంగారు పెట్టేలా ఉంది. ఉమైర్ సంధు 'బ్రహ్మాస్త్రం' మూవీకి యావరేజ్ రేటింగ్ ఇవ్వడం గమనార్హం. ఓవైపు సినిమాపై క్రియేట్ అయిన హైప్, మరోవైపు సినిమా కోసం జరుగుతున్న అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుండగా.. బ్రహ్మాస్త్రం కలెక్షన్స్ రాబట్టినా లాంగ్ రన్ లో కష్టమేనని అన్నాడు. బ్రహ్మాస్త్రం విజువల్స్, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్.. ఇలా అన్ని విషయాలలో బాగానే ఉన్నప్పటికీ.. స్టోరీ, స్క్రీన్ ప్లే యావరేజ్ గా ఉన్నాయని, ఇంటర్వెల్ బోరింగ్ ఉందని చెప్పడం ఉమైర్ సంధు రివ్యూ చర్చనీయాంశంగా మారింది. ఇక సినిమాలో రణబీర్ కపూర్, అలియా నటన బాగుందని.. మౌనిరాయ్ మాత్రం ఇంకా నాగిన్ క్యారెక్టర్ నుండి బయటపడ్డట్లు లేదని, అమితాబ్ క్యారెక్టర్, యాక్టింగ్ ఆకట్టుకుంటుందని అన్నాడు. ఇక చివరిగా బ్రహ్మాస్త్రం మూవీని యావరేజ్ మూవీగా లెక్క కట్టి.. 2.5 రేటింగ్ ఇచ్చాడు ఉమైర్ సంధు. అదీగాక బ్రహ్మాస్త్రం మూవీ ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టగలదని చెప్పలేం అనడం టెన్షన్ పెట్టే విషయం. మామూలుగా ఉమైర్ సంధు రివ్యూస్ అన్ని సినిమాలకు ఊహించని విధంగా ఉంటాయి. సౌత్ సినిమాలకు ఎలివేషన్స్ ఇచ్చే ఉమైర్.. బ్రహ్మాస్త్రం మూవీని ఏ విధంగా యావరేజ్ అనేశాడో రిలీజ్ రోజు చూస్తామంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్, నెటిజన్స్. ప్రస్తుతం సినీ వర్గాలలో ఉమైర్ సంధు రివ్యూ వైరల్ అవుతోంది. మరి అస్త్రాలను శాసించే బ్రహ్మాస్త్రం మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితం అందుకుంటుందో సెప్టెంబర్ 9న చూడాలి. మరి బ్రహ్మాస్త్రం మూవీపై ఉమైర్ సంధు ఇచ్చిన రివ్యూ పట్ల మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి. #Brahmastra = All that Glitters is not gold !!! ⭐️⭐️1/2 — Umair Sandhu (@UmairSandu) September 6, 2022 Fantasy/adventure films are a rarity in Bollywood. Actually, you want to laud #AyanMukerji for being courageous, for venturing into a lane that's rarely visited by dream merchants here. But the screenplay & story is a complete average & sometimes mess in #Brahmastra ! 2.5⭐️/5⭐️ — Umair Sandhu (@UmairSandu) September 6, 2022 #RanbirKapoor looking so confused in #Brahmastra ! He even didn’t know what’s going on ! #Aliabhatt looking stunning in movie ! Wow ! #MouniRoy looking so creepy! Loud performance by her ! #AmitabhBachchan is grace personified. The only regret is, he gets less footage. — Umair Sandhu (@UmairSandu) September 6, 2022 #Brahmastra is also high on VFX and a couple of sequences are well implemented. ⭐️⭐️1/2 — Umair Sandhu (@UmairSandu) September 6, 2022