ముంబయి డ్రగ్స్ కేసులో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు బీటౌన్ నుంచి మద్దతు కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే హృతిక్ రోషన్, పూజా భట్, సల్మాన్ ఖాన్ వంటి వారు మద్దతు తెలపగా.. తాజాగా సీనియర్ నటి సోమీ అలీ కూడా ఆర్యన్ ఖాన్‌ను సపోర్ట్ చేస్తూ ఇన్‌స్టా పోస్టు పెట్టింది. ఆర్యన్ చేసింది తప్పు కాదంటూ సమర్థిస్తూ నటి చెప్పుకొచ్చింది. అతను చేసింది తప్పేంకాదని. డ్రగ్స్, వ్యభిచారం వంటి వాటిని తొలగించలేమని స్పష్టం చేసింది.
‘పిల్లలు డ్రగ్స్ వాడటం సహజం. నాకు ఇదేమీ పెద్ద విచిత్రంగా అనిపించడం లేదు. డ్రగ్స్, వ్యభిచారం వంటి వాటిని పూర్తిగా తొలగించలేము. అందుకే వాటిని క్రిమినల్ జాబితా నుంచి తొలగించాలి. ఇక్కడ సాధువులు ఎవరూ లేరు. నేను నా 15 ఏళ్ల వయసులో డ్రగ్స్ తీసుకున్నా. మళ్లీ దివ్యభారతీతో కలిసి ఆందోళన్ సినిమా షూటింగ్ సమయంలో డ్రగ్స్ తీసుకున్నా. నాకు ఎలాంటి పశ్చాతాపం లేదు’ అంటూ వివాదాస్పదంగా పోస్టు చేసింది. అంతేకాకుండా ‘న్యాయవ్యవస్థ అకారణంగా ఆర్యన్‌ను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఆర్యన్‌లాంటి వారికి బదులు రేప్‌లు చేసేవారిని, హత్యలు చేసే వారిని పట్టుకోవడంపై వారి దృష్టి సారిస్తే ఎలా ఉంటుంది? అంటూ న్యాయవ్యవస్థపై ఆరోపణలు చేసింది. అమెరికాలో 1971 నుంచి డ్రగ్స్‌ను అరికట్టేందుకు కృషి చేస్తున్నారని ఇప్పటికీ అక్కడ ఎంతో సులువుగా డ్రగ్స్ దొరుకుతున్నాయంటూ వ్యాఖ్యానించింది. ‘ఆర్యన్ ఖాన్ నువ్వు ఏ తప్పు చేయలేదు. నీకు న్యాయం జరుగుతుంది. షారుఖ్ ఖాన్, గౌరీ మీరు ధైర్యంగా ఉండండి’ అంటూ ఇన్‌స్టా వేదికగా సోమీ అలీ రాసుకొచ్చింది.
ఇదీ చదవండి: విడాకుల విషయంలో సమంతాకి సపోర్ట్ గా అభిమాని ఓపెన్ లెటర్ !
శుక్రవారం ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌ని మెజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించింది. మూడు నుంచి ఐదు రోజుల క్వారంటైన్ కోసం ఆర్యన్ ఖాన్ సహా కేసులోని మరో ఏడుగురిని ఆర్థర్ రోడ్ జైలుకి తరలించాలని ఆదేశించింది. డ్రగ్స్ కేసులో పట్టుబడిని ఆర్యన్ ఖాన్‌కు బాలీవుడ్ తారలు మద్దతు తెలపడంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.