సినీ ఇండస్ట్రీలో అంటే గ్లామర్ షో అనేది మామూలే. ఈ విషయాన్ని ఇప్పుడిప్పుడు ఇండస్ట్రీలో అడుగు పెట్టాలని ప్రయత్నిస్తున్న యంగ్ సెలబ్రిటీలు ఇట్టే ఫాలో అయిపోతున్నారు. సోషల్ మీడియాలో క్రేజ్ ఉన్నప్పటికీ, బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా పాపులారిటీ దక్కించుకున్న యూట్యూబర్స్ లో దేత్తడి హారిక ఒకరు. ఈ మధ్య హారిక గ్లామర్ సూత్రాన్ని బాగా ఫాలో అవుతున్నట్లుంది.. నెట్టింట ఓ రేంజిలో అందాలను ఆరబోస్తుంది.
బిగ్ బాస్ కి ముందు హారిక కేవలం యూట్యూబ్ ప్రేక్షకులకు మాత్రమే తెలుసు. కానీ ఎప్పుడైతే బిగ్ బాస్ లో అడుగుపెట్టి గ్లామర్ షో ప్రారంభించిందో.. అంతే ఇక సీజన్ పూర్తయ్యేలోపు హారిక ఫ్యాన్ ఫాలోయింగ్ అలా పెరిగిపోయింది. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడే పొట్టి పొట్టి బట్టలతో రచ్చలేపిన హారిక.. బయటికి వచ్చాక ఫోటోషూట్ లతో మరింత బోల్డ్ గా మారిపోయింది.
ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ లో హారికకు 1.5 మిలియన్ కి పైగా ఫాలోయర్స్ ఉన్నారంటే అర్థం చేసుకోవాలి.. ఆమె గ్లామర్ ట్రీట్ కి రేంజి ఫాలోయింగ్ ఉందో. కొత్త కొత్త ఫోటోషూట్స్ తో డిఫెరెంట్ డ్రెస్సింగ్ స్టయిల్స్ తో హారిక సోషల్ మీడియాలో హాట్ షో అదరగొడుతోంది. తాజాగా వైట్ మినీ డ్రెస్ లో హారిక పోస్ట్ చేసిన ఫోటోలు కుర్రకారులో సెగలు రేపుతున్నాయి. టాప్ టు బాటమ్ హాట్ అందాల ప్రదర్శనతో నెటిజన్లను ఆకర్షిస్తోంది హారిక. ఇదిలా ఉండగా.. కెరీర్ పరంగా హారిక ప్రస్తుతం వెబ్ సిరీస్ లు, సినిమాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే హారిక హీరోయిన్ గా నటించిన ‘ఏమండోయ్ ఓనర్ గారు’ వెబ్ సిరీస్ విడుదలైంది. మరి దేత్తడి హారిక గ్లామర్ ట్రీట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.