పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. రాధేశ్యామ్ తర్వాత ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్- K వంటి చిత్రాలు వరుసలో ఉన్నాయి. సినిమాల సంగతి పక్కన పెడితే.. ప్రభాస్ తర్వగా పెళ్లి చేసుకుని ఓ మనవడిని ఇస్తే ఎత్తుకోవాలని ఉందని రెబల్ స్టార్ కృష్ణంరాజు కోరుకున్న విషయం తెలిసిందే. ప్రభాస్ పెళ్లి ఎప్పుడు? అనే ప్రశ్న ఇప్పుడు టాలీవుడ్ లోనే కాదు.. బాలీవుడ్ లోనూ మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలే గానీ పెళ్లి చేసుకునేందుకు ఎంతో మంది అమ్మాయిలు, సెలబ్రిటీలు, హీరోయిన్లు క్యూలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు ఓటీటీ ఫేమ్ శ్రీ రాపాక విభిన్న కామెంట్స్ చేసి వైరల్ గా మారింది.
ఇదీ చదవండి: వీడియో: చీరకట్టులో భర్తతో బాస్కెట్ బాల్ ఆడిన సన్నీలియోన్!
ఆర్జీవీ నగ్నం సినిమాతో హీరోయిన్ గా మారిన శ్రీ రాపాక.. బిగ్ బాస్ తో మరింత ప్రాచుర్యంలోకి వచ్చింది. బయట బోల్డ్ బ్యూటీ అయినా కూడా హౌస్ లో మాత్రం ఎంతో పద్ధతిగా, హుందాగా వ్యవహరించింది. కానీ, రెండోవారంలోనే ఎలిమినేట్ కాక తప్పలేదు. హౌస్ నుంచి బయటకి వచ్చాక ఇంటర్వూలతో ఫుల్ బిజీగా మారిపోయింది. అయితే ప్రతి ఇంటర్వ్యూలో ఆమె వాడే కామన్ పేరు ప్రభాస్. అవును యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు శ్రీ రాపాక అతి పెద్ద ఫ్యాన్ అని చెప్పుకుంటోంది. ఈశ్వర్ సినిమా నుంచి ప్రభాస్ అంటే క్రష్ ఏర్పడిందని చెప్పుకొచ్చింది.
ప్రభాస్ పెళ్లి విషయంపై శ్రీ రాపాక కూడా స్పందించింది. ప్రభాస్ చేసుకుంటే ఒక్కరోజు అయినా అతని భార్యలా బతికితే చాలని తెలిపింది. కానీ, అది జరగదు కాబట్టి.. ప్రభాస్ చేసుకునే వరకు తాను కూడా పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పింది. ఒకవేళ ప్రభాస్ పెళ్లి చేసుకోకపోతే.. తాను కూడా పెళ్లి చేసుకునేది లేదని ప్రకటించింది. ప్రస్తుతం శ్రీ రాపాక వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. శ్రీ రాపాక వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.