లోబోకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సిరి.. కన్నీరు పెట్టుకున్న ఆర్జే కాజల్..

తెలుగు బుల్లితెరపై మంచి ప్రేక్షకాదరణ పొందిన రియాల్టీ షోల్లో ఒకటి బిగ్ బాస్. ప్రస్తుతం తెలుగు లో బిగ్ బాస్ 5 వ సీజన్ నడుస్తుంది. గత నాలుగు సీజన్లతో పోలిస్తే ఈసారి భిన్నంగా మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ ను హౌస్ లోకి పంపించి షాకిచ్చారు బిగ్ బాస్. మొదటి రోజు మూడు టాస్క్ లు ఇచ్చి గేమ్ మొదలుపెట్టిన బిగ్ బాస్ నామినేషన్ ప్రక్రియ మొదలుపెట్టాడు. ఈ వారం ఎలిమినేషన్ కి నామినేట్ అయిన వారిలో రవి, మానస్, సరయు, కాజల్, హామీద, జెస్సీలు ఉన్నారు.

siri lobo1 compressedఈ ఐదో సీజన్‌లో లేడీ కంటెస్టెంట్లు మహా ముదరుగా ఉన్నారు. ఒకరిని మించి మరొకరు అనేట్టుగా ఉన్నారు. పచ్చి బూతుల పిల్ల సరయు అయితే చెప్పనక్కర్లేదు. ఆమె వేషదారణ, మాట తీరు అన్నీ కూడా వింతగానే ఉంటాయి. ఇదిలా ఉంటే ప్రతి రోజు బిగ్ బాస్ షోకి సంబంధించిన ప్రోమోను విడుదల చేసి మంచి హైప్ ను తీసుకొస్తుంటారు. కాకపోతే కొన్ని ప్రోమోలో చూపించినంత విషయం ఎపిసోడ్ లో కనిపించదు. కానీ తాజా ప్రోమో చూస్తుంటే మాత్రం ఈరోజు ఎపిసోడ్ లో రచ్చ మామూలుగా లేదుగా అన్నట్లు ఉంది. ఒకరిపై ఒకరు అప్పుడే మాటల తూటాలు పేల్చుకుంటున్నారు.

rj kajal1 compressedసిరికి లోబోకి ఏదో మిస్ కమ్యూనికేషన్ జరిగినట్లు కనిపిస్తుంది. సిరి వెళ్లి వేరే హౌస్ మేట్స్ కి జరిగిన విషయం చెప్పబోతుండగా.. లోబో వచ్చి ఏదైనా ప్రాబ్లెమ్ ఉంటే నాతో చెప్పు వేరే వాళ్లతో అంటూ తనదైన స్టైల్లో సీరియస్ అయ్యాడు. అదేదీ పట్టించుకోకుండా ఎల్లెహె అంటూ సిరి పట్టించుకోకుండా వెళ్లిపోయింది. దీంతో హర్ట్ అయిన లోబో ఏవేవో మాటలంటూ.. ‘ముఖం చూస్కో అద్దంలో’ అని డైలాగ్ వేశాడు. దానికి సిరి రియాక్ట్ అవుతూ.. ‘ముఖం గురించి మాట్లాడితే ముఖం పగిలిపోద్ది’ అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది సిరి.

rj kajal compressedఇక ఆర్జే కాజల్ ఏదో విషయం గురించి మాట్లాడుతుండగా.. ‘మీరెందుకు అంత హైపర్ అవుతున్నారు.. నాకసలు అర్ధం కావడం లేదని’ లహరి సీరియస్ గా అంది.  ‘డోంట్ క్రియేట్ కంటెంట్ ఆల్వేస్.. ఓకే.. మీరొక పెర్సన్ ను ఎందుకు ఎటాక్ చేస్తున్నారు’ అంటూ కాజల్ పై ఫైర్ అయింది. అందరి ముందు లహరి తనపై నోరు జారడంతో కాజల్ ఏడ్చుకుంటూ అక్కడ నుండి దూరంగా వెళ్లిపోయింది. అయితే కాజల్ ని మానస్ ఊరుకోబెట్టే ప్రయత్నం చేశాడు. మొత్తానికి ఈ రోజు బిగ్ బాస్ కాస్త ఘాటుగానే సాగేలా అనిపిస్తుంది.