బిగ్ బాస్-5 కంటెస్టెంట్ 10.. షణ్ముఖ్ జస్వంత్ లైఫ్ స్టోరీ

తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 ఎట్టకేలకు మొదలైంది. బిగ్ బాస్-5 కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న కింగ్ నాగార్జున అందరికన్నా ముందుగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈసారి బిగ్ బాస్ హౌస్ ఎలా ఉందో.. ప్రేక్షకులకి క్లియర్ గా చూపించారు. ఇక సీజన్ 5 లో 10వ కంటెస్టెంట్‌గా యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. దీంతో.. ఇప్పుడు షణ్ముఖ్ జస్వంత్ వివరాలు తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు.

చదువు అయిపోయిన తరువాత గ్లామర్ ఫీల్డ్ మీద ఉండే ఇష్టంతో చాలా మంది ఇటు వైపు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తుంటారు. అలా.. ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చిన వ్యక్తే షణ్ముఖ్ జస్వంత్. అయితే.., మిగతా అందరిలా షణ్ముఖ్ ఇక్కడ కెరీర్ ని లైట్ గా తీసుకోలేదు. డ్యాన్స్‌ వీడియోలు, షార్ట్‌ ఫిలింస్‌, వెబ్‌ సిరీస్‌ లు అంటూ వచ్చిన ప్రతి అవకాశాన్ని ఒడిసి పట్టుకున్నాడు. బతికితే ఇక్కడే బతకాలని పట్టుదలగా ప్రయత్నాలు చేశాడు.

Big Boss 01 copy min 1సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌, సూర్య వెబ్‌ సిరీస్‌లతో స్టార్ హీరోలకి కూడా సాధ్యం కానన్ని వ్యూస్ దక్కించుకున్నాడు. దీంతో.. షణ్ముఖ్ కి సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. అయితే..షణ్ముఖ్ జస్వంత్ కెరీర్ లో ఎన్ని విజయాలు ఉన్నాయో, అన్నే కాంట్రవర్సీలు ఉన్నాయి. వాటన్నిటిని దాటుకునే షణ్ముఖ్ జస్వంత్ ఇంత దూరం ప్రయాణం సాగించాడు. ఈ సీజన్ లో షణ్ముఖ్ విజేతగా నిలుస్తాడని అతనిపై చాలా మంది ఫ్యాన్స్.. చాలానే నమ్మకాలు పెట్టుకుని ఉన్నారు. మరి.. స్టార్ కంటెస్టెంట్ గా హౌస్ లో అడుగు పెట్టిన షణ్ముఖ్ జస్వంత్ బిగ్ బాస్ సీజన్ 5 టైటిల్ విన్నర్ గా నిలవగలడని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.

(ముఖ్య గమనిక : అతి తక్కువ సమయంలో.. మాకు అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందించడం జరిగింది. త్వరలోనే మరింత సమాచారం అందిస్తాము)