బిగ్ బాస్-5 కంటెస్టెంట్ 13.. సెవన్ ఆర్ట్స్ సరయూ లైఫ్ స్టోరీ

తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 ఎట్టకేలకు మొదలైంది. బిగ్ బాస్-5 కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న కింగ్ నాగార్జున అందరికన్నా ముందుగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈసారి బిగ్ బాస్ హౌస్ ఎలా ఉందో.. ప్రేక్షకులకి క్లియర్ గా చూపించారు. ఇక సీజన్ 5 లో పదమూడో కంటెస్టెంట్‌గా సరయూ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. దీంతో.. ఇప్పుడు సరయూ బయోడేటా గురించి తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు.

యూట్యూబ్ లో 7ఆర్ట్స్ ఛానెల్ ఫాలో అయ్యే వారికి సరయూ గురించి పరిచయం చేయడం కూడా బూతే అవుతుంది. అంత ఫేమస్ ఈ అమ్మడు. మిగతా అందరిలానే సరయూ కూడా ఇండస్ట్రీలో గొప్ప నటిగా రాణించాలని చిన్ననాటి నుండి కలలు కనింది. అవకాశాల కోసం ఏళ్ళ తరబడి శ్రమించంది. కానీ.., ఆమెకి చెప్పుకోతగ్గ అవకాశాలు మాత్రం రాలేదు. కానీ.., 7ఆర్ట్స్ ఛానెల్ స్టార్ట్ చేయడం, ఓ మంచి టీమ్ బిల్డ్ అవ్వడం సరయూ తలరాతని మార్చేసింది. ఈ ఛానెల్ లో బోల్డ్ గా ఈమె చేసిన కంటెంట్ కి కుర్రకారు సూపర్బ్ గా కనెక్ట్ అయిపోయారు.

Big Boss 01 copy min 1కొన్ని వీడియోస్ లో సరయూ అప్పుడప్పుడు స్క్రిప్ట్ ప్రకారం బూతులు మాట్లాడినా, అవన్నీ నవ్వించే విధంగానో, ఆలోచింపచేసే సందేశంతో మిళితం అయ్యి ఉండటంతో అందరూ సరయూని యాక్సెప్ట్ చేసేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ అమ్మడికి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. కేవలం సరయూ కోసమే బిగ్ బాస్ చూసే వారి సంఖ్య పెరగబోతుంది అంటే అతిశయోక్తి కాదు.

అన్నపూర్ణ స్టూడియోలోకి ఒక్కసారైనా అడుగు పెట్టే అవకాశం కోసం చిన్ననాటి నుండి ఎదురుచూస్తున్న సరయూకి బిగ్ బాస్ రూపంలో ఇప్పుడు అవకాశం వచ్చింది. అయితే.., హౌస్ లో ఈమె నడుచుకునే తీరు.. ఫ్యామిలీ ఆడియన్స్ కి ఎంత వరకు కనెక్ట్ అవుతుంది అనే విషయంలోనే విజయ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి, మరి.. తన సొంత కష్టంతో బిగ్ బాస్ లోకి హౌస్ లోకి అడుగు పెట్టిన సరయూ.. సీజన్ 5 టైటిల్ విన్నర్ గా నిలవగలదు అని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.

(ముఖ్య గమనిక : అతి తక్కువ సమయంలో.. మాకు అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందించడం జరిగింది. )