బిగ్ బాస్-5 కంటెస్టెంట్ 3.. లహరి షారి లైఫ్ స్టోరీ

Bigg Boss 5 Telugu Contestant Lahari Shari Biography in Telugu -Suman TV

తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 ఎట్టకేలకు మొదలైంది. బిగ్ బాస్-5 కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న కింగ్ నాగార్జున అందరికన్నా ముందుగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈసారి బిగ్ బాస్ హౌస్ ఎలా ఉందో.. ప్రేక్షకులకి క్లియర్ గా చూపించారు. ఇక సీజన్ 5 లో మూడవ కంటెస్టెంట్ గా.. లహరి షారి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. దీంతో.. ఇప్పుడు లహరి షారి ఎవరంటూ ఈమె వివరాలు తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. కాబట్టి.., ఇప్పుడు మనం లహరి షారి బయోడేటా పై ఓ లుక్ వేద్దాం.

లహరి షారి.. అంటే అందరికీ ముందుగా గుర్తుకి వచ్చేది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, కత్తి మహేశ్ గొడవే. ఆ సమయంలో మొట్ట మొదటిసారిగా కత్తి మహేశ్ ని న్యూస్ స్టూడియోలో దీటుగా ప్రశ్నించిన ఒకే ఒక్క యాంకర్ లహరి షారి. తరువాత జనసేన పార్టీ కోసం తన ఉద్యోగాన్ని కూడా వదులుకుని, ప్రచారం కూడా చేసింది లహరి షారి. ఇక ఈమె బ్యాక్ గ్రౌండ్ గురించి చెప్పుకోవాలంటే ..

Bigg Boss 5 Telugu Contestant Lahari Shari Biography in Telugu -Suman TVలహరి జూన్ 5, 1995న హైదరాబాద్ లో జన్మించింది. చాలా తక్కువ వయసులోనే మోడల్ గా కెరీర్ ని స్టార్ట్ చేసింది. ఇక 2014 లో వచ్చిన లహరి ‘సారీ నాకు పెళ్లైంది’ సినిమాతో నటిగా తన సినీ కెరీర్ ని మొదలు పెట్టింది. అయితే.., ఈమె ఇదే సమయంలో యాంకర్ గాను బిజీ అయ్యింది. ఈటీవీలో వచ్చిన ‘సెలబ్రేషన్స్’ షోతో యాంకర్ గా కెరీర్ ప్రారంభించింది. ఆ తరువాత లహరీ ‘మహా’ న్యూస్ ఛానెల్‌లో జాయిన్ అయ్యింది. ఈ సమయంలోనే పవన్ ఫ్యాన్స్ తరుపున కత్తి మహేశ్ ని ప్రశ్నించి పాపులర్ అయ్యింది లహరి షారి. ఇక అర్జున్ రెడ్డి, మళ్ళీ రావా, పటేల్ SIR, అజ్ఞాతవాసి, పేపర్ బాయ్, శ్రీనివాస కళ్యాణం, జాంబీ రెడ్డి లాంటి సినిమాలు ఈమెకి నటిగా గుర్తింపు తీసుకొచ్చాయి. మరి.. పవన్ కళ్యాణ్ ఫాలోవర్ గా గుర్తింపు ఉన్న లహరి షారి బిగ్ బాస్ సీజన్ 5 టైటిల్ విన్నర్ గా నిలవగలదు అని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.

(ముఖ్య గమనిక : అతి తక్కువ సమయంలో.. మాకు అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందించడం జరిగింది. )