పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..!

తెలుగు ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ మూడేళ్ల విరామం తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమ అభిమాన నటుడు చాలా కాలం తర్వాత వెండితెరపై చూసిన ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారు. ఈ చిత్రం బాలీవుడ్ లో అమితాబచ్చన్ నటించిన ‘పింక్’రిమేక్.. తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేర్పులు తీసి తెరకెక్కించారు.

rana minఈ చిత్రం ఘన విజయం తర్వాత పవన్ కళ్యాణ్ వరుస పెట్టి సినిమాలు తీస్తున్నాడు. ఈ నేపథ్యంలో సాగర్ కే చంద్ర దర్శకత్వంలో త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు సమకూర్చగా.. పవన్ కళ్యాణ్, రానా మల్టీస్టారర్ నటిస్తున్న మూవీ ‘భీమ్లా నాయక్’. ఇప్పటికే విడుదలైన ‘భీమ్లా నాయక్’ టీజర్, పాట హైలెట్ గా నిలిచింది. గబ్బర్ సింగ్ చిత్రంలో పవన్ వీరావేశాన్ని చూశాం.. ఇప్పుడు ‘భీమ్లా నాయక్’లోనూ పవన్ ను పోలీస్ గెటప్ లో రచ్చ చేసిన తీరు అభిమానుల్లో ఈ సినిమాపై అంచనాలను పెంచేసింది. పవన్, రానా నటిస్తున్న మల్టీ స్టారర్ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ప్రముఖ మ్యూజిక్ లేబుల్ ఆదిత్య మ్యూజిక్ “భీమ్లా నాయక్” ఆడియో హక్కులను సొంతం చేసుకుంది.

ఈ సినిమా నుంచి రానా టీజర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మూవీ మేకర్స్ రానా కోసం కూడా ఓ ప్రత్యేక టీజర్ రెడీ అవుతోందని చెప్పి విమర్శకులను కూల్ చేశారు. తాజా సమాచారం ప్రకారం డేనియల్ శేఖర్‌ టీజర్ కు ముహూర్తం ఖరారు అయ్యిందట. ఫిలిమ్ వర్గాల్లో వస్తున్న టాక్ ప్రకారం.. సెప్టెంబర్ 17న డేనియల్ శేఖర్ గా రానాను పరిచయం చేయబోతున్నారట.. ఈ మేరకు టీజర్ కట్ చేస్తున్నట్టు సమాచారం. భీమ్లా నాయక్ మూవీలో పవన్, రానాలతోపాటు నిత్యా మీనన్, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్ రాధాకృష్ణ ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి మూవీని రిలీజ్ చేయబోతున్నారు.