అకీరాని లాంచ్ చేయబోతున్న బండ్ల గణేశ్!

తెలుగు సినీ పరిశ్రమలో మెగాహీరోలకి ఉన్న క్రేజ్ గురించి, రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికే మెగా కాంపౌండ్ లో ఒక క్రికెట్ టీమ్ కి సరిపోయేంత మంది హీరోలు ఉన్నారు. వీరంతా తమ తమ స్థాయిలో సక్సెస్ అయ్యారు, అవుతున్నారు కూడా. కానీ.., ఇంత మంది హీరోలు ఉన్నా.., మెగా ఫ్యాన్స్ మాత్రం పవర్ స్టార్ నట వారసుడి రాక కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. పవన్ కొడుకు అకీరా నందన్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడంటూ కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఒకానొక సమయంలో స్వయంగా రేణు దేశాయ్ ఈ వార్తలను ఖండించినా.., అకీరా కాబోయే హీరో అన్న కామెంట్స్ కి ఫుల్ స్టాప్ పడలేదు. ఇక గతంలో మెగాస్టార్ చిరంజీవి కూడా అకీరా పర్ఫెక్ట్ హీరో మెటీరియల్ అని కితాబు ఇవ్వడంతో పవన్ వారసుడిపై ఫ్యాన్స్ చాలానే ఆశలు పెట్టుకున్నారు. నూనూగు మీసాలతో ఆరడుగుల బుల్లెట్ లా కనిపించే అకీరా తెరపైకి వస్తే.., రికార్డ్స్ బద్దలు కావడం ఖాయమన్నది వారి నమ్మకం. అయితే.., ఇప్పుడు అకీరాని హీరోగా లాంచ్ చేసే బాధ్యత బండ్ల గణేశ్ తీసుకున్నాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బండ్ల గణేశ్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎంతటి అభిమానమో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బండ్ల గణేశ్ కి నిర్మాతగా పవన్ ఇప్పటికే రెండు సినిమాలకి అవకాశం ఇచ్చాడు. త్వరలోనే వీరి కాంబోలో మూడో మూవీ సెట్ కాబోతుందన్న టాక్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా బండ్ల గణేశ్ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చకి కారణం అవుతోంది.

akira 2పవన్ కళ్యాణ్ ఇటీవలే తన కొడుకు అకీరా నందన్ తో కలిసి దిగిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా ఆ ఫోటోను బండ్ల గణేష్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దానికి ‘నా దేవుడుతో నా హీరో ‘ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. దాంతో ఇండస్ట్రీలో సరికొత్త చర్చ మొదలైంది. పవన్ తనయుడిని హీరోగా చూడాలని అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో బండ్ల గణేష్ నా హీరో అంటూ పోస్ట్ పెట్టడంతో అకీరాను బండ్ల గణేష్ లాంచ్ చేయబోతున్నారని వార్తలు ఊపందుకున్నాయి. ఒకవేళ అకీరాని సినిమాల్లోకి తీసుకుని రావాలంటే నిర్మాతగా బండ్ల గణేశ్ పెర్ఫక్ట్ గా సరిపోతారని ఫ్యాన్స్ కూడా అభిప్రాయపడుతున్నారు. పవన్ కళ్యాణ్ అన్నా, మెగా ఫ్యామిలీకి అన్నా.. బండ్లకి విపరీతమైన గౌరవం. వారిని ఎవరైనా ఒక్కమాట అంటే బండ్ల ఫైర్ అయిపోతాడు. ఇక మూవీ ప్రమోషన్స్ ఈవెంట్స్ లో బండ్ల చేతికి మైక్ దొరికితే.. మెగా ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే రేంజ్ లో ఆయన స్పీచ్ లు ఉంటాయి. దీంతో.., ఇంతటి అభిమానం ఉన్న బండ్ల చేతిలోనే అకీరాని పెట్టడం మంచిదన్న టాక్ వినిపిస్తోంది. పైగా.., బండ్లకి దర్శకుడు పూరి జగన్నాథ్ బాగా క్లోజ్. ఈ ప్రాజెక్ట్ కనుక సెట్ అయితే దర్శకుడిగా పూరి కూడా రంగంలోకి దిగే అవకాశం లేకపోలేదు. ఇదే జరిగితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని సేఫ్ లంచ్ చేసిన జగన్.. అకీరాకి కూడా మంచి స్టార్టప్ ఇవ్వగలరన్న విషయంలో సందేహం లేదు. ఇన్ని క్యాలిక్యులేషన్స్ మధ్య పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. మరి.., ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.