‘అఖండ’ బడ్జెట్!…

బాలయ్య ‘అఖండ’ టీజర్ సంచలనాలు రేపుతుంది. తాజాగా 40 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. ఈ సినిమా దెబ్బకు పాత రికార్డులు కూడా చెదిరిపోతున్నాయి. ఉగాది పర్వధినాన్ని పురస్కరించుకొని బాలయ్య సినిమా టైటిల్ ను అనౌన్స్ చేశారు చిత్రయూనిట్. ఈ మేరకు టీజర్ ను విడుదల చేశారు.

pic

గత సినిమాల మాదిరిగానే ఈసినిమాకు కూడా ‘అఖండ’ అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఎంచుకున్నాడు బోయపాటి. ఇక ఈసినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేయబోతున్నారు. అందులో ఒకటి అఘోర పాత్ర. ఇక ఈ సినిమాలో హీరో శ్రీకాంత్ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. అఖండ సినిమా చిత్రీక‌ర‌ణ చివ‌రి ద‌శ‌కు వ‌చ్చేసింది. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌, టీజ‌ర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. కేవలం యాక్షన్ సన్నివేశాల కోసం రూ.30 కోట్లు ఖర్చు పెట్టాలని ప్లాన్ చేస్తున్నాడు బోయపాటి శ్రీను. అయితే రామ్ చరణ్ విన‌య విధేయ రామ‌ సినిమా ఫలితం చూసిన తర్వాత ఈ సినిమాను కేవలం రూ.40 నుంచి రూ.45 కోట్ల లో పూర్తి చేయాలని బాలయ్య కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది.

Balakrishna in Akhanda 1

అయితే చివరికి బోయపాటి అనుకున్నట్లుగానే సినిమాకు రూ.60 కోట్లకు పైగా బడ్జెట్ అయినట్లు ప్రచారం జరుగుతుంది. అఖండపై ఉన్న క్రేజ్ చూస్తుంటే అంత రావడం ఈజీగానే అనిపిస్తుంది. గతంలో లెజెండ్ 40 కోట్లకు చేరువగా వచ్చిందన్న సంగతి విదితమే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here