జబర్దస్త్‌ నరేష్‌ అసలు వయసెంతో చెప్పేసిన ఆవ్‌ సమ్‌ అప్పీ

‘జబర్దస్త్‌ నరేష్‌’ బుల్లితెర ప్రేక్షకుల్లో ఈ పేరు తెలయని వారు ఉండరు అనడం అతిశయోక్తి కాదు. చాలా కష్టపడి పైకొచ్చిన నరేష్‌ ఆర్టిస్టుగా మంచి మార్కులే కొట్టేశాడు. ఇప్పుడు బుల్లితెరలో వచ్చే చాలా వరకు కామెడీ షోలలో నరేష్‌ ఉండటం పక్కా. సీనియర్లు, జడ్జీలు అందరి నుంచి మంచ్రి ప్రశంసలు అందుకున్నాడు. అదే జోరుతో దూసుకుపోతున్నాడు. టీమ్‌ లీడర్లకు ఉన్నంత గుర్తింపు నరేష్‌కు కూడా ఉంది. అయితే, ప్రతి షోలో, దాదాపు చాలా వరకు ఎపిసోడ్లలో నరేష్‌ గురించి ప్రస్తావన రాగానే అతని వయసు గురించే మాట్లాడతారు. అసలు వయసు అంతా ఇంతా అంటూ పుకార్లు పుట్టించారు.

potti naresh ageసుమన్‌ టీవీ ఆవ్‌సమ్‌ అప్పీ, అతని సతీమణిని చేసిన ఇంటర్వ్యూలో నరేష్‌ వయసు గురించి అసలు నిజం చెప్పేశాడు. నరేష్‌ వయసు ఎంతుంటుంది బాబాయ్‌ అనగానే అప్పారావు 18 సంవత్సరాలు అని చెప్పాడు. మరగుజ్జు కూడా కాదు.. ఎత్తు పెరగలేదు అంతే. ఇప్పుడు కొంచం హైట్‌ పెరిగాడు అని చెప్పాడు. అతని ఆకారమే అతనికి బాగా కలిసొచ్చిందని అప్పారావు సతీమణి చెప్పారు. అలా ఉండటం వల్లే టీవీ షోలలో క్లిక్‌ అయ్యాడని తెలిపారు. నరేష్‌ చాలా మంచి హైపర్‌ టాలెంటెడ్‌ అని అప్పారావు ప్రశంసలు కురిపించాడు. అదీ సంగతి మన నరేష్‌ అసలు 18 సంవత్సరాలు అనమాట.