సిగ్గులేని రాజకీయాలకు ఆర్యన్ బలి అవుతున్నాడు.. బాలీవుడ్ నటి ఆవేదన!

బాలీవుడ్ లో సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ని డ్రగ్స్ కేసులో అరెస్టు చేయడం కలకలం రేపుతుంది. ఈ కేసులో ఆర్యన్ తో పాటు,.. అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమిచ, నూపుర్ సారిక, ఇష్మీత్ సింగ్, విక్రాంత్ చోకర్, గోమిత్ చోప్రా, మోహ్క్ జస్వాల్‌ని ఎన్‌సిబి విచారించింది. సుదీర్ఘ విచారణ అనంతరం ఎన్‌సీబీ కార్యాలయంలో వైద్యపరీక్షలు నిర్వహించిన అధికారులు కోర్టులో ప్రవేశపెట్టారు. డ్రగ్స్ కేసులో అరెస్టైన ఆర్యన్ ఖాన్ ప్రస్తుతం ఎన్సీబీ అదుపులో ఉన్నాడు. పక్కా సమాచారంతో ఎన్సీబీ అధికారులు ముంబై తీరంలో క్రూజ్ షిప్‌లో జ‌రిగిన రేవ్ పార్టీ పైన దాడి చేసారు.

kruri minశుక్రవారం జరిగిన విచారణలో బెయిల్‌ పిటిషన్‌ని కోర్టు కొట్టివేయగా.. వారిని ఆర్థర్‌ రోడ్‌ జైలుకి తరలించారు. చాలామంది నటులలాగే సినీయర్‌ నటి రవీనా టండన్‌ సైతం ఈ స్టార్‌కిడ్‌కి మద్దతుగా ట్విట్టర్‌లో పోస్ట్‌ పెట్టింది. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రవీనా టండన్‌ ట్విట్టర్ లో స్పందించారు.

సిగ్గులేని రాజకీయాలు ఓ యువకుడి జీవితం, భవిష్యత్తుతో ఆడుకుంటున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. వారి స్వలాభం కోసం ఇలా చేయడం బాధాకరమని నటి తెలిపింది. మరోవైపు ప్రస్తుతం దేశంలో రాజకీయ శక్తులు కొన్ని కేసులను పక్కదోవ పట్టించడానిక షారూఖ్ తనయుడిని అనవసరంగా కేసులో ఇరికించాలని చూస్తున్నారని ఆరోపిస్తున్నారు.