చిన్నారుల డ్యాన్స్ కి సీఎం ఫిదా.. వీడియో వైరల్

చిన్న పిల్లలు ఏది చేసినా అది చూడముచ్చటగా ఉంటుంది. చిన్నారులు ఆడినా.. పాడినా.. చిలిపి పనులు చేసినా పెద్దలు ముద్దు చేస్తారు. ఆ చిన్నారుల మోములో స్వచ్ఛమైన చిరునవ్వును చూస్తుంటే ఎలాంటి సమస్యలనైనా, కష్టాలైనా ఇట్టే మర్చిపోతుంటాం. ఈ మద్య సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి చిన్న పిల్లలు చేస్తున్న చిలిపి పనులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

asge min 1తాజాగా అరుణాచల్‌ ప్రదేశ్‌లోని సజోలాంగ్‌ తెగకు చెందిన కొందరు చిన్నారులు జానపద పాటలకు ఎంతో అద్భుతంగా డ్యాన్స్‌ చేశారు. చుట్టు పెద్దవాళ్లు పాట పాడుతుంటే.. ఆ పాటకు అనుగుణంగా చిన్నారులు స్టెప్పులు వేశారు. అంతే కాదు అందరూ తమవైపు చూస్తున్నా ఏ మాత్రం తొణకకుండా మరింత ఉత్సాహంతో కాలు కదిపారు. చిన్నారుల డ్యాన్స్‌ అక్కడి వారినే కాదు ఏకంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పెమా ఖండూనే మెప్పించింది.

fage minఈ వీడియోలో రంగురంగుల దుస్తులు ధరించిన చిన్నారులు, జానపద పాటలకు ఎంతో ఉల్లాసంగా కాలు కదపడం అందరినీ ఆకర్శించింది. ఈ సందర్బంగా ‘ఇది మా అరుణాచలం.. మా జీవితాలు కూడా ఇలాగే రంగురంగులు, ఉత్సాహం, ఉల్లాసంతో నిండి ఉంటాయి. వెస్ట్ కమెంగ్ జిల్లాలోని ఖాజాలాంగ్ గ్రామానికి చెందిన ఈ పిల్లలు జానపద పాటలకు ఎంతో అద్భుతంగా డ్యాన్స్‌ చేశారు’ అంటూ అరుణాచల్‌ ప్రదేశ్‌ టూరిజం, ఇన్‌క్రెడిబుల్‌ ఇండియా ట్యాగ్‌ చేస్తూ సీఎం పెమా ఖందూ ట్విట్టర్‌లో రాసుకొచ్చారు.