బిగ్ బాస్-5లోకి అరియానా గ్లోరీ.. మరోసారి?

Ariana Glory Once Again Into Bigg Boss-5 - Suman TV

బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పడా అని ఆతృతగా ఎదురు చూసిన బిగ్ బాస్-5 రానే వచ్చేసింది. తెలుగు  బిగ్ బాస్ అందించే భారీ వినోదం కోసం ప్రేక్షకులు అంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. గత సీజన్ బిగ్ బాస్-4 ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందన్నది అందిరికీ తెలిసిందే. దీంతో మరోసారి వినోదాన్ని అందించేందుకు ఆదివారం రోజున ఘనంగా ప్రారంభమైంది బిగ్ బాస్-5.

దీనికి హోస్ట్ గా కింగ్ నాగార్జున వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఒక్కొక్కరిని పరిచయం చేస్తూ అందరినీ హౌస్ లోకి పంపాడు నాగ్. అలా మొత్తానికి 19 మంది కంటెస్టెంట్ లను హౌస్ లోకి పంపి ఫుల్ మజాను పంచనున్నారు. ఇక విషయం ఏంటంటే..? ప్రతీ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఒక్కొక్కరు ఎలమినేట్ అవుతూ ఉంటారు. అలా ఎలిమినేట్ అయ్యే వారి మనసులోని బాధలు, బిగ్ బాస్ లో గడిపిన అనుభవాలను పంచుకునేందుకు వేదికగా మలిచిందే బిగ్ బాస్ బజ్.

Ariana Glory Once Again Into Bigg Boss-5 - Suman TVహౌస్ నుంచి బయటకు వచ్చిన కంటెస్టెంట్ మనోగాతాన్ని విప్పి మాట్లడించేందుకు బిగ్ బాస్ బజ్ లో వారిని ఇంటర్వూ చేస్తారు. ఇక గతంలో బిగ్ బాస్-4 బజ్ కియాంకర్ గా వ్యవహరించారు బిగ్ బాస్ విజేత రాహుల్ సిప్లిగంజ్. ఇక ఈ సారి బిగ్ బాస్-5 బజ్ ప్రోగ్రామ్ కి యాంకర్ గా రానుంది అరియానా గ్లోరీ. ఇక తాజాగా అరియానా హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్-5 బజ్ ప్రోమో ఒకటి రిలీజ్ అయ్యింది. ఇదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దీంతో ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ మనోగతాన్ని ఆవిష్కరించటంలో అరియానా సక్సెస్ అవుతుందో లేదో చూడాలి మరి..!. ఇక బిగ్ బాస్-5 బజ్ కి యాంకర్ గా రానున్న అరియానా గ్లోరిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.