ప్రతి ఏడాది తెలుగు ఇండస్ట్రీలో కొత్త హీరోలు పుట్టుకొస్తూనే ఉన్నారు. కానీ ఇప్పుడున్న హీరోలలో ఎక్కువగా వారసులు ఉన్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీకి చెందిన బడా దర్శకులు.. నిర్మాతలు.. సీనియర్ హీరోలు ఇలా వారి వారసులే ఎక్కువ. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఫ్యామిలీ నుండి ఆశిష్ రెడ్డి హీరో డెబ్యూ చేస్తున్నాడు. రౌడీ బాయ్స్ అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ యూత్ ఫుల్ సినిమా జనవరి 14న సంక్రాంతి రిలీజుకి రెడీ అవుతోంది.
ఆశిష్ రెడ్డి సరసన కుర్రభామ అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ విడులైంది. ట్రైలర్ లో అనుపమ లిప్ లాక్ చేయడం చూసి ఫ్యాన్స్ ఒక్కసారిగా షాకయ్యారు. ఇంతకాలం సంప్రదాయంగా లిప్ లాక్స్, రొమాన్స్ సన్నివేశాలకు దూరంగా ఉన్న అనుపమ.. ఈ సినిమాలో రెచ్చిపోయేసరికి ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక అనుపమ లిప్ లాక్ సీన్ పై సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అవుతున్నాయి. తాజాగా లిప్ లాక్ సీన్ మీమ్స్ పై అనుపమ, ఆశిష్ లైవ్ లో రియాక్ట్ అయ్యారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోంది. మరి అనుపమ తన పై వస్తున్న మీమ్స్ పై ఎలా రియాక్ట్ అయిందో చూసి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.