డెలివరీ బాయ్ గా మారిన అమితాబచ్చన్.. కన్నీరు పెట్టించింది?

అదేంటీ బాలీవుడ్ ప్రపంచాన్ని ఏలిన మగమహారాజు.. బిగ్ బీ అమితాబచ్చన్ డెలివరీ బాయ్ కావడం ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా..  ఇంతకీ ఇదంతా… ఎక్కడ జరిగింది? ఎందుకు జరిగింది అనే కదా మీ సందేహం. బిగ్ బీతో ఫుడ్ తెప్పించుకున్న ఆ వ్యక్తి ఎవరు అని కూడా మీ సందేహం కదా? అసలు మ్యాటర్ లోకి వద్దాం.  గత కొంత కాలంగా బాలీవుడ్ బుల్లితెరపై ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ ప్రోగ్రామ్ తో కోట్ల మంది అభిమానాన్ని సంపాదించారు అమితాబచ్చన్.

amitaba minఒక వ్యక్తి కోసం..  అమితాబ్‌ బచ్చన్‌ డెలివరీ బాయ్‌గా అవతారమెత్తారు. ఎందరికో పార్శిల్స్‌ అందించే ఉద్యోగం చేస్తున్న తనకు, ఎవరైనా పార్శిల్‌అందిస్తే అందుకోవాలన్న కోరిక తీర్చేందుకు స్వయంగా తానే ఓ డెలివరీ బాయ్ గా మారి ఆ యువకుడికి పార్శిల్‌ అందించారు బిగ్‌ బీ. దాంతో అక్కడున్న వాళ్లంతా ఆనందభాష్పాలు రాల్చారు. ప్రముఖ సోనీ టీవీలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా కౌన్ బనేగా కరోడ్ పతి 13వ సీజన్ ఆసక్తిగా నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ షోలోనే ఈ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఆకాశ్ వాగ్ రే అనే వ్యక్తి ఈ షోలో పాల్గొన్నాడు. అతడు డెలివరీ బాయ్ గా విధులు నిర్వహిస్తూ ఉంటాడు. ఆకాశ్ కి చదువు అంటే చాలా ఇష్టం.. తన కల నెరవేర్చుకోవడానికి రాత్రిళ్లు చదువుకుంటుంటాడు.

koun minఈ కార్యక్రమంలో ఆకాశ్ గురించి బిగ్ బీ మాట్లాడుతూ… మన కలని నిజం చేసుకునేందుకు ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. మన కల ముందు ఎలాంటి సవాలైని చిన్నదిగా కనిపిస్తోంది… ఇందుకు ఆకాశే ఉదాహరణ అని చెప్తాడు. ఇక తన కోసం తల్లిదండ్రులు ఎంతో కష్టపడ్డారని, వారిని మంచిగా చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉన్నదని ఆకాశ్‌ చెప్పాడు. అందరికీ ఫుడ్ డెలివరీ చేసే ఆకాశ్ కి తనకు ఎవరైనా ఫుడ్ డెలివరీ చేస్తే బాగున్ను అన్న కోరిక తెలుసుకున్న బిగ్ బీ.. ఆయన కోసం డెలివరీ బాయ్‌గా అవతారం ఎత్తారు. ఆయనకు ఒక పార్శిల్‌ను అందించారు. దాంతో అక్కడ ఒక్కసారిగా ఉద్విఘ్న వాతావరణం నెలకొన్నది. ఆకాశ్ అతని కుటుంబ సభ్యులతో పాటు అక్కడ ఉన్నవారందరూ కన్నీరు పెట్టుకున్నారు. అదే సమయంలో డెలివరీ బాయ్‌గా పనిచేయాలన్న తన కోరికను కూడా తీర్చుకున్నట్లు అమితాబ్‌ బచ్చన్‌ చెప్పారు.